శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో. ఘనంగా ఉగాది వేడుకలు!

ధర్మపురికి చెందిన వేద పండితులను

సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వం !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నూతన తెలుగు పర్వదినం శోభాకృత నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మపురి కి చెందిన చిలక ముక్కు రమణాచార్యులు, పాలెపు ప్రవీణ్ శర్మ, రొట్టె ప్రహల్లాద్ శర్మలను, హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం పక్షం దేవాదాయ శాఖ మంత్రి ఘనంగా సన్మానించారు

.

రమణాచార్యులు!
ప్రవీణ్ శర్మ!
ప్రహల్లా శర్మ

ఇదిలా ఉండగా.. ధర్మపురి ఆలయ ప్రాంగణంలోని.
శేషప్ప కళ వేదికపై వంశపార్యం పర పంచాంగ ప్రవచకులు బుగ్గారపు రాజేంద్రప్రసాద్, పంచాంగ శ్రవణం చేశారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని ఆలయ పక్షాన ఘనంగా సన్మానించారు.

దిలీప్ శర్మ (వేదం)
గుండె ప్రేమ్ కుమార్!
డాక్టర్ చంద్రశేఖర్ కవిత్వం !
గుండి జగదీశ్వర్ గాయకులు
డాక్టర్ గొల్లపల్లి గణేష్, సాహిత్యం


దిలీప్ శర్మ (వేదం), డాక్టర్ గొల్లపల్లి గణేష్ ( సాహిత్యం) గుండి ప్రేమ్ కుమార్, (కళలు) డాక్టర్ చంద్రశేఖర్ (కవిత్వం), గుండి జగదీశ్వర్ (గాయకులు), బుగ్గారపు రాజేంద్రప్రసాద్, ( పంచాంగ కర్త) లను. ఆలయ అధికారులు, వేద పండితులు, ఘనంగా సన్మానించారు.