J.SURENDER KUMAR,
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి మండలలో పలు గ్రామాలు గురువారం జరిగిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాలనీ, జైన , దొంతాపూర్ , రాయపట్నం, గ్రామలలోని రామాలయలను దర్శించుకొనీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి కళ్యాణోత్సావం లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమం లో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగన బట్ల దినేష్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మొగిలి, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపధ్యక్షుడు వేముల రాజేష్, సిపతి సత్యనారాయణ, ఆశేట్టి శ్రీనివాస్, చిలుముల లక్ష్మణ్, స్తంభంకాడి గణేష్, రఫియొద్దిన్, సుముక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..