శ్రీ యమధర్మరాజు కు ప్రత్యేక పూజలు!
ధర్మపురి ఆలయంలో…

J.SURENDER KUMAR,

”భరణి” నక్షత్రంను పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు దేవాలయం లో స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు జరిపారు.
స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్షు హోమం, హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా జరిగాయి.

కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , అర్చకులు వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్, ప్రదీప్ కుమార్ , నేరెళ్ల సంతోష్ కుమార్, బొజ్జా సంతోష్ కుమార్, సంపత్ కుమార్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్!

శనివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ N V శ్రావణ్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.


కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ ,పాలెపు ప్రవీణ్ కుమార్ ,ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్, రాజగోపాల్ మరియు స్థానిక కోర్టు మెజిస్ట్రేట్ శ్యాం ప్రసాద్ స్థానిక SI రామక్రిష్ణ పాల్గొన్నారు.