J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నేడు కొనసాగుతున్నది. ఇందులో మూడు పట్టభద్రులు స్థానాలు, రెండు ఉపాధ్యాయ స్థానాలు, నాలుగు స్థానిక సంస్థల స్థానాలు ఉన్నాయి.
స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

కర్నూలు – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 988 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మధుసూధన్ గెలుపొందారు.

శ్రీకాకుళం – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 632 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు.

ఏలూరు – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్ 481 ఓట్లతో, వంకా రవీంద్రనాధ్ 460 ఓట్లతో 2 స్థానాల్లో విజయం సాధించారు.