J.SURENDER KUMAR,
టీ ఎస్పీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగుల అందరికీ నిరుద్యోగ భృతిని కల్పించాలి. పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. శనివారం జగిత్యాల లోని ఇందిరా భవన్లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
ఆయన మాటల్లో…
TSPSC కమిటీ సభ్యుల్లో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సభ్యులను నియమించి రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నైతిక బాధ్యత వహించి పదవి కి రాజీనామా చేయాలి రాష్ట్ర గవర్నర్ తన విచక్షణ అధికారాలు ఉపయోగించి టిఎస్పిఎస్సి చైర్మన్, సెక్రెటరీ ల ను తక్షణమే విధులనుండి తొలగించాలి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలి. సీట్ రాష్ట్ర ప్రభుత్వ జేబు సంస్థ
కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు చేయడం కాదు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా తెలివి చూపాలి.
ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం విచారణకు రాష్ట్ర క్యాబినెట్ అంతా ఢిల్లీకి తరలి వెళ్లారు కాని రాష్ట్రంలోని నిరుద్యోగులను గాలికి వదిలేశారు.
అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.