TSPSC  పేపర్ లీకేజీలో  తో తెలంగాణ ప్రతిష్ట  దిగజారింది.

J.SURENDER KUMAR,

పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన పరీక్షల పేపర్లు చైర్మన్ కార్యదర్శి ఆధీనంలో అత్యంత భద్రత మధ్యన ఉండాలి, కానీ వారి స్వార్థ ప్రయోజనాలకు కొంతమంది వ్యక్తుల కోసం లీకేజీ జరిగి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట  దిగజారిందని బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ అన్నారు.  

  ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవలసిన అవసరం  ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం  జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన  మెమోరాండం లో పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అలిశెట్టి ఈశ్వరయ్య, బి.సి సంక్షేమ సంఘం జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్, బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీకూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, బి.సి. సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దీటి వెంకటేష్, బి.సి. సంక్షేమ సంఘం రాయికల్ మండల అధ్యక్షుడు బండారి సాయిరాజ్ గౌడ్, బి.సి సంక్షేమ సంఘం జగిత్యాల నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చిరుపుల్ల మల్లేష్ యాదవ్, మరియు బి.సి నాయకులు తదితరులు పాల్గొన్నారు.