నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దు.
జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !.
J. SURENDER KUMAR,
విదేశాల్లో ఉద్యోగాల కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని. నకిలి ఏజెంట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నేపధ్యంలో, ప్రభుత్వ గుర్తింపు వున్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు. నిరుద్యోగ యువతి యువకులు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించే ముందు సంబందిత ఏజెంట్లకు అనుమతి ఉందా లేదా అని తెలుసుకోవాలని జిల్లా ఎస్పి సూచించారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉద్యోగరీత్యా గల్ఫ్ అభ్యర్థులకు వీసాలు ఇప్పించు ప్రభుత్వ ఆమోది పొందిన 25 ఏజెన్సీల తో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో నకిలీ గల్ఫ్ ఎజెంట్స్ విజిట్ వీసాలు పై జిల్లా లో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేసి వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్పి ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకి పంపిస్తారు అని అక్కడికి అప్పులు చేసి వెళ్లిన తరువాత కంపనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఎం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవడం లేదా, అక్కడే ఏదో చిన్న చితక కూలి పని చేసుకోవడం వంటివి జరుగుతునాయని అయితే ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలిసులకు పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు పై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు ఏజెంట్ పై కేసు నమోదు చేయడం, సదరు ఏజెన్సీల రద్దు కు సిఫారసు చేయడం తో పాటు వారి ఫై PD ఆక్ట్ పెడతాం ఎస్పీ అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అంతేకాకుండా వారిని బైండోవర్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఎస్పీలు రవీంద్రరెడ్డి, ప్రకాష్, SB ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు, ప్రభుత్వ అనుమతి పొందిన ఏజెంట్స్ లు పాల్గొన్నారు