జర్నలిస్టు సంఘ జిల్లా అధ్యక్షుడు
చీటీ శ్రీనివాస్ రావు !
J.SURENDER KUMAR,
జిల్లాలో పనిచేస్తున్న విలేఖరుల దుస్థితి దిన దిన గండంగా మారిందని, అందుకే విలేఖరులకు రక్షణ కల్పించాలని జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పెల్లి టౌన్ రిపోర్టర్ (ఆంధ్రజ్యోతి) లో పని చేస్తున్న వేణుగోపాల్ రావు పై శనివారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడడం దురదృష్టకరం అన్నారు. కేవలం తనపై వార్తలు రాసాడనే నెపంతో ఈ దాడి జరిగిందని సదరు రిపోర్టర్ పేర్కొన్నారని, వార్త రాస్తే దాడులకు దిగడం ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం దాడి జరిగిన, నేటికీ పోలీసులు కేవలం కేసు నమోదు చేసాము అని పేర్కొన్నారే తప్ప, నిందితులను అరెస్ట్ ఎందుకు చేయడం లేదని అయన ప్రశ్నించారు.

విలేఖరిపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేఖరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధిత విలేఖరికి న్యాయం జరగని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని అయన పేర్కొన్నారు. దాడికి నిరసనగా రేపు (మంగళవారం ) అన్నీ మండల కేంద్రల్లో నిరసనలు తెలుపాలని శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోరపల్లి ప్రదీప్ కుమార్, జిల్లా సభ్యులు రాజ్ కుమార్, దూడం శ్రీశైలం, పాత్రికేయులు ముక్క వేణుగోపాల్, బద్దెనపెళ్ళి మల్లేశం, అల్లాల రాజేంధర్, సంపూర్ణ చారి, షఫీయొద్దీన్, కోల హరీష్, సామ మహేష్, రాజు, నరహరి, చింత లక్ష్మణ్, శ్రీనివాస్, హరీష్ తదితరులున్నారు.