వైభవంగా ఉగ్ర నరసింహుడి తెప్పోత్సవం !

ఘనంగా ఆరంభమైన త్యాగరాజు ఉత్సవాలు!

J.Surender Kumar,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం ఉగ్ర నరసింహ స్వామి తెప్పోత్సవము, డోలోత్సవం బ్రహ్మ పుష్కరిణిలో వైభవంగా జరిగింది.
స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు kభారీగా తరలి వచ్చారు, ఆలయ అధికారులు సిబ్బంది అర్చకులు అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లును పర్యవేక్షించారు.

ఘనంగా ప్రారంభమైన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు!

ఆలయ శేషప్పకళా వేదికపై బుధవారం శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ సంగీత విద్వాంసుడు స్వర్గీయ చాచం కిష్టయ్య చిత్రపటానికి, పూలమాలవేసి సంగీత ప్రియులు , విధ్వంసులు, సాహితీవేత్తలు నగర సంకీర్తన చేశారు.

అనంతరం శేషప్ప కళావేదికపై త్యాగరాజ కృతుల ఆలాపనతో కార్యక్రమాన్ని ఆరంభించారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగనభట్ల నరసయ్య, నాట్యమండలి కార్యదర్శి సెక్రెటరీ నరహరి, సలహాదారు సంగనపట్ల రామకృష్ణయ్య. ఆలయ అధికారులు అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక గాయకులు, నాట్యమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.