సమాజంలో ఉపాధ్యాయులు, వైద్యులు ఉన్నతమైనవారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పుర్జన్మనిచ్చాడు వైద్యుడు. ఉపాధ్యాయులు జీవితాన్ని ఇస్తారు.
రెండేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన వైరస్ కు తమ ప్రాణాలను ఫంగా పెట్టి ఎంతో మందికి వైద్యం చేసి ప్రాణాలను కాపాడారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి వారు అనారోగ్యం పాలవుతాం అని తెలిసి కూడా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్న వైద్యులు నిజంగా దేవుళ్ళు. సంవత్సరానికి 365 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుడతారు వైద్యులు, అర్థరాత్రి తలుపుతట్టి అర్థిస్తే చీకటిని సైతం లెక్క చేయకుండా రోగి కోసం ఆలోచిస్తారు.
జాతీయ వైద్యుల దినోత్సవం చరిత్ర ప్రతి సంవత్సరం మార్చి 30 న అమెరికాలో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. మొట్టమొదటి సారిగా డాక్టర్ డే ని మార్చి 30, 1933 జార్జియాలోని విండర్‌లో జరిగింది. తీసుకున్న విజ్ఞప్తి మేరకు మార్చి 30, 1958 న వైద్యుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మాణాన్ని ఆమోదించింది. 1990లో జాతీయ వైద్యుల దినోత్సవం సెనెట్‌లో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెనెట్, ప్రతినిధుల సభలో చట్టం ఆమోదం పొందిన తరువాత, అక్టోబర్ 30, 1990 న, అధ్యక్షుడు జార్జ్ బుష్ SJres. పబ్లిక్ లా 36 ప్రకారం (ప్రస్తుతం ఈ లా 101-473 గా మార్చబడింది) మార్చి 30 ను “నేషనల్ డాక్టర్స్ డే”గా ప్రకటించారు. ఇక ఈ వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలో డాక్టర్ బి. సి. రాయ్ పుట్టినరోజు జ్ఞాపకార్థం జూలై 1 న భారతదేశంలో జరుపుకుంటారు. భారతదేశం మొదటగా జూలై 1, 2014 దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంది. జూలై ఒకటవ తారీఖున జన్మించి, మరణించిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ (BCరాయ్) గౌరవార్ధం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన ఫిబ్రవరి 4, 1961న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును అందుకున్నారు. ఆయన జూలై 1, 1882న జన్మించిన పాట్నాలో జూలై 1, 1962లో మరణించారు. అక్టోబర్ నెలలో తొలి సోమవారం నాడు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుతున్నారు.
అయితే క్యూబా వంటి కొన్ని దేశాల్లో మాత్రమే జనాభా నిష్పత్తికి అనుగుణంగా వైద్యులు ఉన్నారు. భారత దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా వైద్యులు లేరు. వైద్యం ఖరీదవ్వడానికి ఇదొక ముఖ్య కారణం. కాబట్టి
డిమాండ్‌కు అనుగుణంగా వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త :
యం. రాం ప్రదీప్, తిరువూరు 9492712836