జగిత్యాల ఎమ్మెల్యే. సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈమేరకు స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గంతోపాటు సభ్యులంతా ఎమ్మెల్యే ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఎన్నికైన ఎర్ర నర్సయ్య తోపాటు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం డిగ్రీ కళాశాలలో వాకర్స్ కోసం హైమాస్ లైట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఆలాగే హైనస్ లైట్ కు విద్యుత్ కనెక్షన్ ఇప్పించి వెలిగే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోరగా, స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తన్నీరు పరంధాములు, పిల్లి శ్రీనివాస్, సాగి శ్రీధర్ రావు, అంబారి శ్రీనివాస్, సిగిరి రాజేందర్, పిల్లి కిషన్, వేముల శ్రావణ్, ములాసపు రాజన్న, కుర్ర కృష్ణ, చల్ల లక్ష్మారెడ్డి, మోహన్, దావ ప్రసాద్, లింగాల గంగారెడ్డి, గడ్డం శ్రీనివాస్, శ్రీధర్ రావు, మురళీధర్ రావు, గుండ సురేష్, పృధ్విధర్ రావు తదితరులు పాల్గొన్నారు.