J. Surender Kumar,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం లోని
వెల్కటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి గుంగుల కమలాకర్ సోమవారం ₹ 13,. కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
అంబారీపేట నుండి తాళ్ల కొత్తపేట, వయా పైడిపల్లి, చెగ్యామ్ వరకు ₹ 12 కోట్ల సి ఆర్ ఆర్ బ్రాండెడ్ నిధులు మరియు పైడిపల్లి నుండి పడకల్ గ్రామం వరకు ₹ 1.40 కోట్ల సి ఆర్ ఆర్ గ్రాండ్ నిధులతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీమతి షేక్ యస్మిన్ భాష, జడ్పీ చైర్మన్ దావసంత, ఎస్పీ భాస్కర్, ఎంపీ మద్దిరాజ్ రవిచంద్ర, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధు, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.