అమర్‌నాథ్ యాత్ర  జులై 1న ప్రారంభం – ఆగస్టు 31 న ముగింపు!

ఏప్రిల్17 నుంచి యాత్రికుల రిజిస్ట్రేషన్ !

J.SURENDER KUMAR,

అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్ర జూలై 1 నుండి ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు  తెలిపారు.
తీర్థయాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 17న ప్రారంభమవుతుంది. 

దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న
అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి దేశంలో నలువైపుల నుండి తరలివచ్చే యాత్రికులు రక్షణ భద్రత వసతి సౌకర్యాల ఏర్పాట్ల కోసం,
రాజ్‌భవన్‌లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్ర బోర్డు (ఎస్‌ఎఎస్‌బి) 44వ సమావేశంలో తీర్థయాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేశారు.