J.Surender Kumar
భారతదేశంలోనే నభూతో నభవిష్యత్తు అనే తరహాలో నిర్మితమైన రాష్ట్ర నూతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం ఆదివారం అంగరంగ వైభవంగా సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
వేద పండితులు నిర్వహించిన ముహూర్తం, పూజ సాంప్రదాయాలను, హోమాలు యాగాలు ప్రాంగణంలో వేద పండితులను నిర్వహించారు.
ఆరవ అంతస్తులో పగలు 1-58 ని 2-04నీ సీఎం తన చాంబర్లో ప్రవేశించి తన కుర్చీలో కూర్చోగానే వేద మంత్రాలతో పండితులు ఆశీర్వదించారు.

నూతన సచివాలయంలోసీఎం తొలి సంతకం!
గృహలక్ష్మి, పోడు భూముల పంపిణీ ఫైళ్లపై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు.
మంత్రి కేటీఆర్!
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై కేటీఆర్ తొలి సంతకం… మంత్రి మహమూద్ అలీ!
కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరుపై హోమ్ మంత్రి మహమూద్ అలీ సంతకం…
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి!
జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాల ఫైల్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం…
మంత్రి మల్లారెడ్డి!
శ్రమ శక్తి అవార్డుల ఫైలు పై మల్లా రెడ్డి తొలి సంతకం…
మంత్రి గంగుల కమలాకర్!
అంగన్ వాడీలకు సన్నబియ్యం పంపిణీపై మంత్రి గంగుల కమలాకర్ సంతకం…
మంత్రి కొప్పుల ఈశ్వర్!
రెండో విడత దళిత బంధు పధకం ఫైలు,ఎస్సీ సబ్ ప్లాన్ ఫైల్ సంతకం చేశారు.
మంత్రి హరీష్ రావు!
సీతారామ ప్రాజెక్టు ఫైల్ పై మంత్రి తన్నీరు హరీష్ రావు తొలి సంతకం…
మంత్రి నిరంజన్ రెడ్డి!
చెక్ డ్యామ్ ల నిర్మాణం ఫైలు పై మంత్రి నిరంజన్ రెడ్డి సంతకం…
మంత్రి దయాకర్ రావు!
కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలు పై మంత్రి ఎర్రబెల్లి తొలి సంతకం…
మంత్రి సత్యవతి రాథోడ్!
అంగన్ వాడీ కేంద్రాల్లో ఒకటి మూడు సంవత్సరాల మధ్య ఉన్న చంటి పిల్లలకు ఉచితంగా పాలు పంపిణీ ఫైలు పై మంత్రి సత్యవతి రాథోడ్ సంతకం…
మంత్రి తలసాని!
ఉచిత చేప పిల్లల పంపిణీ ఫైలు పై మంత్రి తలసాని తొలి సంతకం…

సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ చాంబర్ లో ధర్మపురి వేద పండితులు పూజలు!

ధర్మపురి క్షేత్రానికి చెందిన వేద పండితులు కాసర్ల వంశీ శర్మ, సంఘనపట్ల దిలీప్ శర్మ ఆధ్వర్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు.

నూతన సచివాలయంలో తన ఛాంబర్ లో సతీమణి స్నేహలత, కూతురు నందిని, అల్లుడు అనిల్ కుమార్, మనవడు భవానీ నిశ్చల్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమం లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, యంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ ఎల్. రమణ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్తా, ఉమ్మడి కరీంనగర్ డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రామగుండం మేయర్ అనిల్, జగిత్యాల పెద్దపల్లి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు చంద్ర శేఖర్ గౌడ్, రఘువీర్ సింగ్,

రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణ రావు, జెడ్పీటీసీ లు బాధినేని రాజేందర్, రాజేందర్ రావు, ధర్మారం మండలం నందిమేడారం పాక్స్ చైర్మన్ బలరాం, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మకరంద్, ఎస్సీ అభివృద్ధి,. మైనారిటీ, దివ్యంగుల శాఖా అధికారులు, సిబ్బంది, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.