అంగరంగ వైభవంగా  ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు గురువారం రెండవ రోజున అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.


  మే నెల 4 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
సహస్ర కలశాభిషేకం, చందనోత్సవం ఉత్సవం, వసంతోత్సవం, 4 న జయంతి . ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పుణ్య వచనము, కరణము, కలశస్థాపన, అభిషేకము, వేదోక్తముగా, సహస్ర కలశ స్థాపన, నవగ్రహ యోగిని, వాస్తు క్షేత్రపాలక స్థాపన, అర్చనాది కార్యక్రమాలు నిత్య హోమాలు, నిర్వహించారు. 

ప్రతి నిత్యము లక్ష్మి సూక్త సంపుటీకరణ, లలిత, విష్ణు, సహస్రనామ పారాయణ లు, సామవేద పారాయణం, తులసి అర్చన కార్యక్రమాలు జరిగాయి.
నవరాత్రుల్లో ప్రధాన ఉత్సవాలు !


30-04-2023, ఆదివారం  సహస్ర కలశాభిషేకం,
01-05-2023 సోమవారం  చందనోత్సవం !
02-05-2023, శుక్రవారం పల్లవ ఉత్సవం, వసంతోత్సవం,
04-05-2023 శ్రీ నరసింహ జయంతి !
విస్తృత ఏర్పాట్లు !
తొమ్మిది రోజుల పాటు భారీగా తరలి వచ్చే భక్తజనం సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కార్య నిర్వహణాధికారి సిబ్బంది. విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు


తాగునీటి వసతి చలువ పందిళ్ళు భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అభివృద్ధి కమిటీ సభ్యులు,  కార్యనిర్వహణాధికారి , సిబ్బంది  భక్తుల సౌకర్యాల కల్పన కోసం చర్యలు చేపడుతున్నారు.
ఆలయ అధికారులు అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తజనం, తదితరులు స్వామివారి నవరాత్రి ఉత్సవాల ఆరంభ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.