జె.సురేందర్ కుమార్,
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన హనుమాన్ భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను హనుమాన్ దీక్ష స్వాములు, పూజారులు గురుస్వాములు శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మెన్ దామోదర్ రావు, పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్, సర్పంచ్ ప్రభాకర్, ఉప సర్పంచ్ మహేష్, గ్రామ శాక వెంకటి, నాయకులు, హనుమాన్ దీక్ష స్వాములు నిర్వహించారు.
మంచినీటికి భూమి పూజ!

నర్సింగాపూర్ గ్రామంలో కేసీఆర్ డబల్ బెడ్ రూం ఇండ్లకు మిషన్ భగీరథ పథకం 20 ఇండ్లకు ఇంటింటికి మంచి నీరు కార్యక్రమంలో భాగంగా 3 లక్షలతో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ సరోజన -మల్లారెడ్డి, ఎంపీటీసీ మహేష్, జిల్లా హెచ్‌సీఏ మెంబర్ దావా సురేష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సురేందర్, గ్రామ శాక అధ్యక్షులు గంగారెడ్డి, మాజీ సర్పంచ్ నరేష్,.మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, ఈఈ సత్యనారాయణ రెడ్డి, డీఈ జలంధర్ రెడ్డి,వో రవిబాబు, నాయకులు, ఇతరులు ఉన్నారు.