ఏప్రిల్ 14న వైభవోపేతంగా 125 అడగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ!

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 బస్సుల ద్వారా 300 మంది తరలించాలి!


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి!

J.SURENDER KUMAR,

భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్ 14న వైభవోపేతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేడ్కర్ జయంతి వేడుకలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు అదనపు కలెక్టర్లు బిఎస్సి లత మంద మకరంద తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో నిర్మించిన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, దీనిని విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యెలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 బస్సులతో ప్రజలను తరలించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల కేంద్రం నుంచి బస్సులు నడపాలని సీఎస్ తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకార్యక్రమానికి తప్పనిసరిగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్ కు ప్రజలు చేరుకునే విధంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు ఆ రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు చేయాలని, ప్రతి బస్సులో పోలీస్ అధికారి, ప్రభుత్వ అధికారినీ నియమించి బాధ్యతలు అప్పగించాలని, బస్సు తిరిగి మండల కేంద్రాలకు చేరే వరకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేయాలని సీఎస్ పేర్కొన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని, దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు జిల్లాలో పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. రెండవ విడత క్రింద ఎంపిక చేసిన 3.38 లక్షల లబ్దిదారులలో మరణించిన వారి నామిని వివరాలు సేకరించి వారికి గొర్రెల యునిట్లను పంపిణి చేయాలని అన్నారు.
ప్రతి మండల పరిధిలోని లబ్దిదారులతో రెండవ విడత గొర్రెల పంపిణీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్దిదారున్ని వాటా సేకరించాలని, గొర్రెల కోనుగోలు కోసం వెళ్ళెందుకు సినియర్ అధికారినీ నియ మించాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష అధికారులకు గొర్రెల పంపిణీ, అంబేద్కర్ జయంతి పై పలు సూచనలు చేశారు. జిల్లాలో గొర్రెల పంపిణీ రెండవ విడత సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ కు సూచించారు
దృశ్య మాధ్యమ సమీక్ష కు జిల్లా కలెక్టరెట్ నుండి కలెక్టరు శ్రీమతి షేక్ యాస్మిన్ భాష అదనం కలెక్టర్లు బి ఎస్ లత, మంద మకరందం, ఆర్డీవోలు వినోద్ కుమార్ ,మాధురి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో తదితరులు పాల్గొన్నారు
.