C.P.S ఉద్యోగుల ఆకాంక్షను ప్రభుత్వాలకు తెలిపే ఆత్మగౌరవ ర్యాలీ!
J.SURENDER KUMAR,
C.P.S రద్దు కై రాష్ట్ర వ్యాప్త కాన్స్టిట్యూషనల్ మార్చ్ లో భాగంగా ఏప్రిల్ 16 న జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత్ బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు జరిగే మార్చ్ లో ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర సి పి ఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్ కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ర్యాలీని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని . వృద్దాప్యంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కోసం బాధ్యతగా ర్యాలీలో పాల్గొనాలి అని మన కోసం మన కుటుంబ సంక్షేమం కోసం TSCPSEU ఎన్నో వ్యయ, ప్రాయాసలను తట్టుకొని, సందర్భానుసారంగా తనదైనశైలిలో సరైన సమయంలో సరైన పంథాలో సామూహిక సెలవు, ఆయుత ధర్మ దీక్ష, జనజాతర ….లాంటి సాహసోపేతమైన కార్యాచరణ రూపొందిస్తూ మనకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించి పెట్టిన TSCPSEU చివరగా రాబోయే ఎలక్షన్స్ లోపు పాత పెన్షన్ సాధించాలనే ధృడ సంకల్పంతో నేడు పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ కి శ్రీకారం చుట్టింది అని . ఈ సమయంలో బాధ్యత గల C.P.S ఉద్యోగిగా ర్యాలీని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరి మహేష్ , ప్రధాన కార్యదర్శి సర్వ సతీశ్, జిల్లా కోశాధికారి గొల్లపెళ్లి మహేష్ గౌడ్,బోగశ్రీనివాస్ గణేష్, ప్రమోద్, జనార్దన్, వంశీ, సుధాకర్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు