అతిక్రూరమైన దాడులకు.. ప్రతి దాడి మాత్రమే!
మావోయిస్ట్ పార్టీ !

సౌత్ సబ్ జోన్ అధికార ప్రతినిధి సమత !

J.SURENDER KUMAR,

దండకారణ్య అటవీ ప్రాంతంలో ప్రభుత్వ బలగాలు జరుపుతున్న దాడులకు నిరసనగానే అరన్ పూర్ ఘటనకు పాల్పడ్డామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది.
సౌత్ సబ్ జోన్ అధికార ప్రతినిధి సమత పేరిట చత్తిస్ గడ్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ దాడికి పాల్పడింది పి.ఎల్.జి.ఏ నని వెల్లడి చేశారు. ఆ ఘటనకు ఒకరోజు ముందు ప్రభుత్వ బలగాలు విచక్షణా రహితంగా అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపి 17 మంది గ్రామస్తులను కొట్టి అరెస్ట్ చేశారని సమత వివరించారు. ఇలాంటి ఘటనలను నివారించటానికే అరన్ పూర్ వద్ద జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి వేసినట్లు వివరించారు.

ఇతర ఉద్యోగాలలో చేరండి.
మావోయిస్ట్ ఇతర ఉద్యోగాలలో చేరండి అని మావోయిస్ట్ పార్టీ కొత్త నినాదం అందుకుంది. తమ ఎత్తుగడలను పసిగట్టి పై ఎత్తులు వేస్తున్న పోలీసుల వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తుంది. పోలీస్ ఉద్యోగాలు తప్ప ఇతర ఏ ఉద్యోగాల్లో ఐనా చేరండి అని సమత విజ్ఞప్తి చేశారు. ఇతర శాఖల్లో నియామకాల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసి పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రమే నిర్వహిస్తుందని ఆరోపించారు. దాంతో విధిలేక తమ కుటుంబాలను పోసించు కోవటానికి నిరుద్యోగులు పోలీస్ విభాగంలో చేరుతున్నారని అభిప్రాయపడ్డారు.