బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పూజలు!

J.SURENDER KUMAR,

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా గురువారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా  ప్రత్యేక పూజలు చేసారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులకు అమ్మ వారి తీర్ద ప్రసాదలు అంద చేశారు.

మంత్రి ఈశ్వర్ జన్మదిన సందర్భంగా
సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు. అభినందనలు తెలిపారు. మంత్రుల నివాస ప్రాంగణంలో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు.


రాష్ట్ర ఎస్సి అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపు కున్నారు.
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో గురువారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ధర్మపురి నియోజకవర్గం బీఆర్ ఎస్ శ్రేణులు, అభిమానులతో పాటు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు.
ధర్మపురిలో..


  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో అలాగే అనుబంధ దేవాలయములలో మంత్రిగారి పేరున అభిషేకంలు బీఆర్ఎస్ శ్రేణులు చేయించారు.
నంది చౌక్ లో కేక్ కట్!


ధర్మపురి పట్టణ భీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి మంత్రి జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు
.