బొగ్గు బ్లాక్స్ ప్రైవేటీకరణకు నిరసన గా  స్మారక స్తూపం వద్ద బీఆర్ఎస్ మహా ధర్నా !

J.SURENDER KUMAR,

సింగరేణి ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా శనివారం రామగుండం నియోజకవర్గం గోదావరిఖని లో చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటి పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు, సింగరేణి బొగ్గుగనుల వేలం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS పార్టీ ఆధ్వర్యంలో  రామగుండం గోదావరిఖని కేంద్రంలో  చేపట్టిన మహాధర్నా  కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..


తెలంగాణలో బొగ్గు బంగారమైన సింగరేణి సంస్థలు బిజెపి ప్రభుత్వం కుటిల రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతున్నది అని మంత్రి అన్నారు, రామగుండం వచ్చిన సందర్భంగా సింగరేణి  ప్రైవేటుపరం చేయబోమని చెప్పి ఆరు నెలలు గడవకముందే, తానిచ్చిన మాటను నిలుపు కోకుండా గనులను వేలం వేయడం తీవ్ర విచారకరమని మంత్రి అన్నారు సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నదని, మరోసారి బొగ్గు బ్లాక్ ల వేలం వేయడానికి ఎండగట్టాలని, సింగరేణి బొగ్గు గనుల వేలం మరోసారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో మహా మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది  మంత్రి అన్నారు,
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మిక లోకం ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం ఉన్నదాన్ని కేంద్రానికి కేవలం 49 శాతం మాత్రమే ఉన్నదని అలాంటి పరిస్థితులలో తాము చేయడం వీలుకాదని చెప్పి న కేంద్రం ప్రైవేటీకరణ కు పావులు కదుపుతూ వారి కుటిల రాజకీయాలకు పావులు కదుపుతోంది అని మంత్రి అన్నారు.