J.SURENDER KUMAR,
హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఎత్తైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ.. దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతుంది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో డాక్టర్ బీఆర్ అంబేంద్కర్ విగ్రహం నమోదు అయ్యింది.

ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అందించారు.