బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కుటుంబ సభ్యులే!

బుగ్గారం మండలంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో మంత్రి కొప్పుల ఈశ్వర్!

J. Surender Kumar,

టిఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ కుటుంబ సభ్యులే, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండల కేంద్రంలో శనివారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ,జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్ గారు,ఎంపీపీ బాదినేని రాజమణి గారు,వైస్ ఎంపీపీ సుచందర్ గారు, బుగ్గారం సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ గారు,మండల సర్పంచ్లు,ఎంపీటీసీ రైతుబంధు సమితి అధ్యక్షులు, నాయకులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.