క్యాన్సర్ బాధితురాలికి వైద్యం కోసం ₹ 1.16 లక్షలు సాయం !

సామాజిక మిత్రుల దాతృత్వం!

J. Surender Kumar,

వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ క్యాన్సర్ బాధితురాలికి ఫేస్బుక్ పోస్టుకు స్పందించిన సామాజిక మిత్రులు సదరు బాధితురాలు వైద్య ఖర్చులకోసం ₹ 1.16 లక్షలు సాయం అందించి తమ దాతృత్వం చాటుకున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి.

పెగడపల్లి మండల్ , బతికెపెళ్లి గ్రామానికి చెందిన పెంట లక్ష్మిరాజం వెంకవ్వ దంపతులు తన కూతురితో కలిసి నివాసం ఉంటున్నారు.

లక్ష్మీరాజ్యం జగిత్యాల లోని ఓ వీధిలో టీ కొట్టు ఏర్పాటు చేసుకొని భార్య పిల్లల్ని పోషిస్తున్నాడు.
తను సంపాదించేది కుటుంబ పోషణకి సరిపోక ఇబ్బందులు పడుతున్న తరుణంలో భార్య వెంకవ్వకు కొన్ని నెలల క్రితం క్యాన్సర్ వ్యాధి సోకింది. దాంతో వైద్య ఖర్చులకోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కొన్ని నెలలు మందులు వాడాల్సి ఉండగా నెలకు ₹ 20 వేలు ఖర్చు అవుతాయి.
పండ్లకు డబ్బులు లేకపోవడంతో వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నారు.
వీరి పరిస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి వెంకన్న వైద్యానికి సాయం అందించాలని ఫేస్ బుక్ లో ఏప్రిల్ 4 న పోస్ట్ చేసి వెంకవ్వ బ్యాంకు ఖాతాను పొందుపరిచాడు.
ఫేస్ బుక్ స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు, ఇతర దాతలు కలిసి వేంకవ్వ బ్యాంకు ఖాతాకు ₹ 1.16 లక్షలు సాయమందించారు. దాతలు అందించిన సాయంతో మందులు కొనుగోలు చేస్తారని రమేష్ తెలిపారు.