ధనవంతులు ఎవరో స్పష్టం అవుతున్నాయి!
బాబు ఆస్తులు మరిచాయి. జగన్ ఆస్తులు హైలెట్ చేశాయి!
J.SURENDER KUMAR,
ఎసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స (ఏడీఆర్) నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్ధలు సంయుక్తంగా రెండుజాబితాలను విడుదల చేశాయి. మొదటిదేమో దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక సీఎం ఎవరు ? అలాగే సీఎంలకు ఉన్న ఆస్తులు ఎంత ? అనేది ఒక జాబితా. ఇక రెండో జాబితా ఏమిటంటే దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ఎంఎల్ఏ ఎవరు ? అనే అంశంలతో వారి ఆస్తుల వివరాలతో జాబితాలను విడుదల చేసింది.
సీఎం జగన్ ఆస్తులు ₹ 510 కోట్లు!
తాజా జాబితాలో ముఖ్యమంత్రులందరిలోకి జగన్మోహన్ రెడ్డి రిచ్చెస్ట్ సీఎం అని తేల్చింది. జగన్ ఆస్తులు ₹ 510 కోట్లట. అలాగే మిగిలిన 29 మంది సీఎం ఆస్తులు కూడా విడుదల చేసింది. ఈ అంశాన్ని రెండు ప్రముఖ ప్రాంతీయ పత్రికలు ( తెలుగు రాష్ట్రాల్లో) దీన్ని బాగా హైలైట్ చేసింది.
ఎమ్మెల్యే చంద్రబాబు ఆస్తులు ₹ 668 కోట్లు!
అయితే ఈ సంస్ధలే రిలీజ్ చేసిన రిచ్చెస్ట్ ఎంఎల్ఏల్లో చంద్రబాబునాయుడుది దేశంలోనే మూడో ప్లేసు. చంద్రబాబు ఆస్తులు ₹ 668 కోట్లు. అంటే
ముఖ్యమంత్రిగా జగన్ ఆస్తులకన్నా ఎంఎల్ఏగా చంద్రబాబు ఆస్తులు ₹158 కోట్లు ఎక్కువగా ఉన్నాయి.
జగన్ కు అన్ని ఆస్తులున్నాయంటే వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఉండచ్చు . ఎమ్మెల్యే చంద్రబాబు. నాయుడు ఎప్పుడు మాట్లాడినా తన చేతికి ఉంగరం లేదు, వాచీ కూడా లేదని బీద మాటలు మాట్లాడుతుంటారు . మరి ఇన్ని వందల కోట్లు ఎలావచ్చాయి ? ఈ విషయాన్ని మీడియా ప్రముఖంగా చెప్పాలి ,. జగన్ ఆస్తులకన్నా చంద్రబాబు ఆస్తులే ఎక్కువైనపుడు అసలు ప్రచురించాల్సిన వార్తే చంద్రబాబు నాయుడు మీదా, కానీ జగన్ ఆస్తులను బాగా హైలెట్ చేస్తూ ప్రచురించిన ఆ పత్రికలు చంద్రబాబు ఆస్తులు గురించి రాయలేదు. ఇందుకే కాబోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎల్లోమీడియా అనడం లో అతియో శక్తి లేదనే చర్చ కొనసాగుతున్నది.

ఇదే అంశాన్ని ఇండియాహెరాల్డ్.కామ్ ఆ ఎల్లో మీడియా ఎలా హైలెట్ చేసిందో తన పత్రికలో ప్రచురించింది.
(ఇండియాహెరాల్డ్.కామ్ సౌజన్యంతో)