J.SURENDER KUMAR,
యువతీ యువకుల జీవితాల్లో, పెళ్లి అనేది చిరస్మరణీయమైన మధురానుభూతి, ఘనంగా జరగకపోయినా , ఆర్థిక స్థితి గతుల నేపథ్యంలో కొన్ని పెళ్లిళ్లు సాదా సిదాగా జరగడం షరా మామూలు. ఆర్థిక ఇబ్బందుల్లోని ఆ కుటుంబం తన కూతురు వివాహం సాదాసీదాగా ఓ ప్రార్థన మందిరంలో జరిపించడానికి సిద్ధపడ్డారు.
విషయం తెలిసిన వీధిలోని ఇరుగు పొరుగు వారు ఆ వీధి యువత కలసికట్టుగా తమవంతుగా చందాలు జమ చేశారు . కుటుంబ ఆర్థిక పరిస్థితులను కొందరు దాతలకు వివరించారు.

స్వచ్ఛందంగా స్పందించిన స్థానిక WHY Team మిత్ర బృందం, పక్షాన డాక్టర్ గొల్లపల్లి గణేష్, ₹ 10,116/-. తుంగూరు కు చెందిన. అజయ్, ₹ 10,000/- కాంగ్రెస్ నాయకులు సంఘనబట్ల దినేష్, ₹,15,000/- విలువ గల గృహ వస్తువులు, చాడ హరికృష్ణ, ₹ 2000/- శ్రీమతి భీమా భద్రావతి ₹ 2000/- శ్రీమతి చెరుకు రజిత, ₹ 1000/-. ఉప్పుల రమేష్, ₹ 500/- అందించి

మేమున్నామంటూ హనుమాన్ వాడకు చెందిన నిరుపేద తండ్రి లేని ఓరుగంటి మంజుల వివాహం కు చేయూత అందించగా, ఆ వాడ యువత కలిసికట్టుగా ముందుండి పెళ్లి ఏర్పాట్లతో పాటు వంటకాలు, భోజనాలు, పెళ్లి ఏర్పాట్లను భుజాన వేసుకొని బుధవారం అంగరంగ వైభవంగా జరిపించారు. ఆవాడ యువత పలువురి దాతల దాతృత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు.
