ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు!
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ నిబద్ధత ఏమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగితే మీకు తెలుస్తుందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , మాట్లాడింది ఒకటైతే, మీరు అర్థము చేసుకోకుండా ఆయనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం, మానుకోవాలని, మరోసారి ఆరోపణలు చేస్తే ఊరుకోమని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. .
శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళలో దళితులకు ఎంతో చేసిందన్నారు. దళితులకు ఎన్నో అవకాశాలను కల్పించారని జీవన్ రెడ్డి సహకారంతో నేని పొజిషన్లో ఉన్నానని అడ్లూరి అన్నారు.
లక్ష్మణ్ కుమార్ మాటల్లోనే..
👉 దళిత బందు పతకములో అక్రమాలకు పాల్పడిన వారి చిట్టా ఉందని ముఖ్యమంత్రి అంటే ఆ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడరన్నారు.
👉 ఇందులోనూ ముఖ్యమంత్రిని ఆన్ పార్లమెంట్ భాషలో మాట్లాడలేదని కేవలం దళితులకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఎందుకు ఖర్చుచేయలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారన్నారు.
👉 చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జగిత్యాలలో మీడియా సాక్షిగా జీవన్ రెడ్డి పచ్చి అబద్దాలు అడుతున్నాడని, స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని ఆరోపించారన్నారు.
👉 దేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టని రీతిలో హైద్రాబాద్లో అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు, దళితులను ఉద్ధరించినట్లు రవిశంకర్ చెప్పుకొచ్చాడని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 వాస్తవానికి వస్తే జీవన్ రెడ్డి రాజకీయ నిబద్ధత ఏమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ ను రవిశంకర్ అడిగితే బాగుంటుందన్నారు.
👉 కాంగ్రెస్ పాలనలో తెచ్చిన ఎస్సి, సబ్ ప్లాన్ తో ఎందరో దళితులకు మేలు జరిగిందని సబ్ ప్లాన్ నిధులపై నిలదీస్తే జవాబు చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారన్నారు.
👉 ఎస్సి సబ్ ప్లాన్ కింద కేటాయించిన ₹ 17 వేల 7 వందల కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
👉 కాంగ్రెస్ పార్టీ ఎస్సి సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను దారిమళ్లించిన విషయాన్ని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరూపిస్తామని అందుకు మీరు సిద్ధమేనా అని ఉమ్మడి జిల్లాలో ని దళిత ఎమ్మెల్యేలకు, మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.
👉 123 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకొంటున్న కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకృష్ణ, బాల్క సుమన్ లు మీ నియోజకవర్గాలలో నిరుపేదలకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారో, ఎంతమంది దళిత యువతకు ఉద్యోగలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని అడ్లూరి డిమాండ్ చేశారు.
👉 బీఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రసని దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని లేకుంటే తల నరుక్కుంటానని ప్రకటించారని ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ గుర్తుచేశారు.
👉 అక్రమంగా కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన కమీషన్ల సొమ్ముతో ఎన్నికలకు పోవాలి ఓట్లు కొనాలనే తపన తప్ప బీఆర్ఎస్ పాలకులకు పాలనపై చిత్తశుద్ధి లేదన్నారు.
👉 కొప్పుల ఈశ్వర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాడో ? చెప్పాలని డిమాండ్ చేశారు.
👉 ఇచ్చిన ఇండ్ల శాతం 0.01 శాతమేనని ఇక దళితబందు పతకంలో ఎంపికైన వారిలో అందరూ బీఆర్ఎస్ జెండా మోసినోళ్లేనని అడ్లూరి అన్నారు. ఇక నిరుపేద దళితులకు దళితబందు అందిందా ? అన్న కోణంలో కొప్పుల ఈశ్వర్ ఏనాడు అధికారులతో రివ్యూ చేపట్టలేదన్నారు.
👉 దళితులకు కాంగ్రెస్ ఎంతో చేసిందని ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్గా పనిచేసి న్యాయం చేశానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు.
అనంతరం చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెడిపెల్లి సత్యం మాట్లాడుతూ,
👉 ఆరెస్సెస్ నుంచి ఆరెస్యూ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు రాష్ట్రంలో ఆదరించే ఒకే ఒక వ్యక్తి జీవన్ రెడ్డి అని మెడిపెల్లి సత్యం అన్నారు.
👉 కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ సమాజం చేత గౌరవింపబడుతున్న నాయకుడు జీవన్ రెడ్డి అని ఇలాంటి నాయకుడిపై చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ స్థాయి మరిచి మాట్లాడారని నోరుఆదుపులో పెట్టుకోవాలని సత్యం హెచ్చరించారు.
👉 ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏర్పడిన అభద్రతబావం తో జీవన్ రెడ్డిపై అనవసరపు మాటలు మాట్లాడారన్నారు.
👉 కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసిందేమని రవిశంకర్ ప్రశ్నించారని వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ దళితులకు చేసిందేమిటో చెప్పాలన్నారు.
👉 కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎంతో చేసిందని దళితున్ని ముఖ్యమంత్రిని చేసిందని, ఏఐసిసి అధ్యక్షునిగా దళితున్ని నియమించిందని సత్యం అన్నారు.
👉 కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటర్లుగా చూడలేదని బీఆర్ ఎస్ పార్టీ దళితులను ఓటర్లుగా చూస్తోందని సత్యం అన్నారు.
👉 123 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2015 లో శంకుస్థాపన చేస్తే ఎన్నికల వేళ మొన్న ప్రారంభించారన్నారని ఇదంతా ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయమన్నారు.
👉 నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డిపై ఇంకోసారి అనవసరంగా మాట్లాడితే ఊరుకోమని రవిశంకర్ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడాలని మెడిపెల్లి సత్యం హెచ్చరించారు.
అనంతరం బండ శంకర్ మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, నాయకులు మున్న, గుండా మధు, బీరం రాజేష్, రమేష్ బాబు తోపాటు పలువురు ఉన్నారు.