ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల వివాదంలో  కొత్తకోణం!

ఎన్నికల కమిషన్ ఫలితాల, రిటర్నింగ్ అధికారి

నివేదికలో అంకెల వ్యత్యాసం!

J.SURENDER KUMAR,

ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల వివాదంలో ఆదివారం కొత్త కోణం వెలుగు చూసింది.. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఫలితాల అంకెలు, రిటర్నింగ్ అధికారి నివేదిక అంకెల్లో వ్యత్యాసం అగుపిస్తున్నది.
వివరాల్లోకి వెళితే

ధర్మపురి ఎన్నికల వివాదా అంశంలో హైకోర్టు జోక్యం చేసుకొని ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి సమాచారం ఇవ్వాలి అంటూ జిల్లా యంత్రాంగంలో ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ధర్మపురి ఎన్నికల ఫలితాలు వివరాలు!


2018 డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఫలితాల సమాచారం ఇలా ఉంది. 22 ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం. మొత్తం ఓటర్ల సంఖ్య, 206701,
పోలైన ఓట్లు, 1,65,341,  పోస్టల్ బ్యాలెట్లు 406, మొత్తం కలుపుకొని 1,65,747 ఓట్లు పోల్ గాక, 80.19,% నమోదుగా పేర్కొనబడింది.
ఇందులో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు 70,579 ఓట్లు పోల్ కాగా ఇందులో 117 పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. 42.58% శాతం నమోదుగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి  లక్ష్మణ్ కుమార్ కు.70,138 ఓట్లు పోల్ కాగా ఇందులో 267 . పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. 42.32% శాతం నమోదుగా పేర్కొన్నారు. వీరితోపాటు పోటీలో ఉన్న 10 మంది అభ్యర్థులు మొత్తం 12 మంది అభ్యర్థులకు కలిపి మొత్తం,1,65,747 ఓట్లు పోలే 80.19% శాతం నమోదుగా పేర్కొనబడింది.
రిటర్నింగ్ అధికారి  నివేదికలో…

రిటర్నింగ్ అధికారి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు జిల్లా కలెక్టర్కు పంపిన నివేదిక!,


సమాచార హక్కు చట్టం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు సేకరించిన వివరాలను ఆదివారం వారు వి ఆర్ కె ఇంజనీరింగ్ కళాశాల వద్ద మీడియాకు వివరించారు.
లేఖ సంఖ్య.ఈ/255/2018, తేదీ 08/12/2018  ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారికి ,జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారికి ఇచ్చిన నివేదికలో.
మొత్తం ఓటర్ల సంఖ్య 2,06,622 అని పేర్కొన్నారు. 269 పోలింగ్ కేంద్రాలలో 1,65,341 ఓట్లు పోల్ కాగా 80.02 శాతం నమోదైనట్టు పేర్కొన్నారు. 269 పోలింగ్ కేంద్రాలలో  ఓటర్ల సంఖ్య 2,06,622 కాగా, ఇందులో 1,01,672 పురుష ఓటర్లు, 1,04,948 మహిళా ఓటర్లు ఉన్నారు.  పోలైన 1,65,341 ఓట్లలో 75,732 పురుషులు, 89,609 మంది మహిళా ఓట్లు పోలైనట్టు నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేసిన వెబ్సైట్ లో.. రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారులకు, సమర్పించిన నివేదిక లో మొత్తం ఓట్ల సంఖ్యలో  79 అంకెల వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పోలైన పోస్టల్ బ్యాలెట్లు వ్యాలీడ్ ఓట్ల సంఖ్య  406 ను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో స్పష్టంగా నమోదు చేశారు.
ఆదివారం స్ట్రాంగ్ రూమ్ లో గల సమాచారం 17 ఏ, ,17 సి పత్రాలతో పాటు నాటి వీడియో రికార్డింగ్, సి సి ఫుటేజ్ లను హైకోర్టు సమర్పించడానికి జగిత్యాల జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతుంది.

ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్


జగిత్యాలలోని నూకపల్లి గ్రామంలోని వీఆర్‌కే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని స్ట్రాంగ్‌రూమ్‌ను జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా మరియు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి, కొందరు ఉన్నతాధికారుల సమక్షంలో తెరిచారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 10న జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు చేరుకున్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం తాళాలు మాయమైనట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేయడంతో గదిని తెరవాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
ఓట్ల రీకౌంటింగ్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌ను విచారిస్తున్న హైకోర్టుకు ఎన్నికల సంఘం అధికారులు 17ఎ, 17సి పత్రాలను సమర్పించనున్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 441 ఓట్లతో ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈశ్వర్ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు.
ఈశ్వర్‌కు 70,579 ఓట్లు, లక్ష్మణ్‌కు 70,138 ఓట్లు వచ్చాయి.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో విచారణపై స్టే విధించాలని కోరుతూ ఈశ్వర్‌ వేసిన పిటిషన్‌ను గతేడాది సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా లక్ష్మణ్ తరపు న్యాయవాది విభేదాలను ఎత్తిచూపారు. మొత్తం 269 పోలింగ్‌ కేంద్రాల్లో 1,65,209 ఓట్లు పోలయ్యాయని, 79.96 శాతం పోలింగ్‌ నమోదైందని రిటర్నింగ్‌ అధికారి చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి ఇచ్చిన నివేదికలో తెలిపారు. అయితే, ఆర్టీఐ చట్టం కింద అధికారులు తమకు అందించిన సమాచారం ప్రకారం 1,65,341 ఓట్లు పోల్ కాగా, పోలింగ్ శాతం 80.02గా నమోదైంది. అంటూ సమాచారం ఇచ్చారని. ఆరోపించారు. హైకోర్టు కు జిల్లా యంత్రాంగం సమర్పించునున్న నివేదికలు కీలకంగా మారనున్నాయనే చర్చ నెలకొంది.