ధర్మపురి వాసికి ప్రధాని మోడీతో
సంభాషించే అరుదైన అవకాశం దక్కింది!

J.SURENDER KUMAR,

కొన్ని గంటల వ్యవధిలోనే  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సంభాషించే అరుదైన, అపూర్వ ఆకాశం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ధర్మపురికి చెందిన కొరిడే చంద్రశేఖర్ కు దక్కనున్నది.
సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం ప్రారంభించడానికి. ప్రధాని నరేంద్ర మోడీ రానున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పలు అధికారిక కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో
11.47 నుంచి 11.55 దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.

ప్రిన్సిపాల్ కోరిడే చంద్రశేఖర్


సెంట్రల్ స్కూల్, తిరుమల గిరి, ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న  కొరిడే చంద్రశేఖర్ సికింద్రాబాద్, విద్యార్థిని దేవోశ్రీ ఘోష్ XII క్లాస్ (బాలిక)
ప్రధాని మోడీతో సంభాషించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అసోసియేటెడ్ ప్రొఫెసర్ గా  విధులు నిర్వహించిన స్వర్గీయ డాక్టర్ కొరిడే రాజన్న శాస్త్రి, కుమారుడే చంద్రశేఖర్

హైదరాబాద్ లో మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ..
ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు
11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు
11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.
11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు
12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్‌ ప్రసంగం…
12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్‌ వీడియోల ప్రదర్శన.
12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం
1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం