దూపదీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షునిగా మహేంద్ర చార్య !

J. Surender Kumar,

ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా నాగరాజు మహేంద్ర చార్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణ ఆవరణలో శుక్రవారం జిల్లా దూపదీప నైవేద్య అర్చక సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించరు.

జిల్లా అధ్యక్షనిగా నాగరాజు మహేంద్ర చార్య, ప్రధాన కార్యదర్శి అల్వాల ఆత్మారాం, కోశాధికారిగా చెరుకు శ్యాంసుందర్ ను ఏకగ్రీవంగా సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మహేంద్ర చార్య మాట్లాడుతూ సంఘాన్ని మరింత సంఘటితం చేసి అర్చక సభ్యుల సమస్యలపై కృషి చేస్తానని, సంఘ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక వెల్ఫేర్ బోర్డు మెంబర్ జక్కాపురం నారాయణ, ఆ సంఘ రాష్ట్ర సంఘ గౌరవ అధ్యక్షులు ఏటూరి ఆంజనేయ చార్య, ప్రచార కార్యదర్శి నాగరాజు మధుసూదనాచార్య , ఆలయాల అర్చకులు పదిరే నారాయణరావు, సేనాధిపతి ప్రవీణ్ కుమార్, ఎడ్ల పల్లి రాజశేఖర్ శర్మ, నందగిరి మురళీకృష్ణ, రామోజుల గోవర్ధన శర్మ, నాగరాజు రమేష్, కూర్మచలం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.