బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియామకం!
J.SURENDER KUMAR,
జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణికి బిజెపి రాష్ట్ర శాఖ సముచిత స్థానం కల్పించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమిస్తూ. ఆ పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకే నియామకం చేపట్టినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.
బీజేపీ పార్టీ ని జగిత్యాల జిల్లా లో మరింత పటిష్టం పరిచి మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేస్తు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ప్రజల ఆశీసులతో బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు , అలాగే పార్టీలో తనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న జగిత్యాలజిల్లా నాయకులకు , అసెంబ్లీ కన్వీనర్ లకు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.