ఈ నెల 26 నుంచి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాలు!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ఈనెల 26 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.  మే నెల 4 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో ప్రధాన ఉత్సవాలు
సహస్ర కలశాభిషేకం, చందనోత్సవం ఉత్సవం, వసంతోత్సవం, 4 న జయంతి . ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పుణ్య వచనము, కరణము, కలశస్థాపన, అభిషేకము, వేదోక్తముగా, సహస్ర కలశ స్థాపన, నవగ్రహ యోగిని, వాస్తు క్షేత్రపాలక స్థాపన, అర్చనాది కార్యక్రమాలు నిత్య హోమాలు, నిర్వహించనున్నారు.  ప్రతి నిత్యము లక్ష్మి సూక్త సంపుటీకరణ, లలిత, విష్ణు, సహస్రనామ పారాయణ లు జరుగుతున్నాయి.

నవరాత్రుల్లో ప్రధాన ఉత్సవాలు !

30-04-2023, ఆదివారం  సహస్ర కలశాభిషేకం,
01-05-2023 సోమవారం  చందనోత్సవం !
02-05-2023, శుక్రవారం పల్లవ ఉత్సవం, వసంతోత్సవం,
04-05-2023 శ్రీ నరసింహ జయంతి !


విస్తృత ఏర్పాట్లు !


తొమ్మిది రోజుల పాటు భారీగా తరలి వచ్చే భక్తజనం సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కార్య నిర్వహణాధికారి సిబ్బంది. విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు తాగునీటి వసతి చలువ పందిళ్ళు భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అభివృద్ధి కమిటీ సభ్యులు,  కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సిబ్బంది  భక్తుల సౌకర్యాల కల్పన కోసం చర్యలు చేపడుతున్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆహ్వానం!


శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి  నవరాత్రి ఉత్సవాలకు సతీసమేతంగా రావాల్సిందిగా కోరుతూ సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఆహ్వానం పత్రికను అందజేసి ఆహ్వానించారు.