నేడు తెరుచుకోనున్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ !
అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కు సమాచారాన్ని ఇచ్చిన జగిత్యాల జిల్లా కలెక్టర్ !
హైకోర్టు కు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పత్రాలను రిటర్నింగ్ అధికారి ద్వారా సమర్పించనున్న యంత్రాంగం!
ఈనెల 11న హైకోర్టు కు నాటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సమాచారం !
J. Surender Kumar,
గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరగడంతో తాను ఓటమి పొందాను అంటూ ధర్మపురి ఎస్సీ రిజర్వుడ్ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను తమకు సమర్పించాలని హైకోర్టు జస్టిస్ జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కి ( కలెక్టర్ కు) డైరెక్షన్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా కలెక్టర్, (జిల్లా ఎలక్షన్ అధికారి) సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన వి.ఆర్.కే. ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూమ్ ను సోమవారం. ఉదయం 10 గంటలకు తెరుస్తారు.
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి
సమర్పించే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పత్రాలను ఈనెల 11న హైకోర్టులో సమర్పించనున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ 400 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.

ఇక్కడి నుండి గెలుపొందిన కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంల లెక్కింపులో అవకతవకలు జరిగాయని 2019లో లక్ష్మణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు.
కరోనా కారణంగా రెండేళ్లపాటు ఈ కేసులో పురోగతి లేకుండా పోయింది. కేసుకు సంబంధించి సంబంధిత పత్రాలు, సిసి ఫుటేజ్
తమకు సమర్పించాలని హైకోర్టు జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారిని ఆదేశించినా.. వారు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయని సమాధానం ఇచ్చారు.
ఈ సమాధానంతో సంతృప్తి చెందని కోర్టు రిటర్నింగ్ అధికారి బిక్షపతికి వారెంట్ జారీ చేసింది.
ఈనెల 4న హైకోర్టు జస్టిస్ కే లక్ష్మణ్, కేంద్ర , రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులకు నాటి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సమాచారాన్ని ఈనెల 11న హైకోర్టు సమర్పించాలని ఆదేశించారు.

హైకోర్టు ఆదేశంతో జిల్లా ఎన్నికల అధికారి ( కలెక్టర్) ఈనెల 7న, లేఖ సంఖ్య H4/1191/2019, ద్వారా అభ్యర్థి ఏ. లక్ష్మణ్ కుమార్ కు నోటీసు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్, సమయాలు, స్థలం వివరిస్తూ హాజరు కావలసిందిగా ముందస్తు సమాచారం ఇచ్చారు.. లెక్కించిన ఓట్ల సంఖ్య, ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిసి ఫుటేజ్, మొత్తం వీడియో రికార్డింగ్ కు సంబంధించిన డివిడి, లేదా పెన్ డ్రైవ్, తో పాటు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల నియమ నిబంధనల వివరాలను హైకోర్టుకు సమర్పించనున్నారు.