హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ; స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై!

J. Surender Kumar,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటల 35 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తమిళ్ సై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి విమానాశ్రయంలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి కూడా స్వాగతం పలికారు.హైదరాబాద్ లో భారత ప్రధాని మోదీ.,
, కిషన్ రెడ్డి, బండి సంజయ్ , లక్ష్మణ్ , ఈటెల రాజేందర్


బండి సంజయ్ చొరవతో  బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిసేందుకు ప్రధాని అనుమతి
స్వీపర్ సహా ఆఫీస్ లో పనిచేసే  40 మంది సిబ్బందిని మరికొద్ది నిమిషాల్లో మోదీ కలవబోతున్నారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్ద మోదీ తో కలవనున్న బీజేపీ సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకున్న మోదీ… మోదీ మోదీ నినాదలతో మారుమొగుతున్న రైల్వే స్టేషన్
దేశంలో 13వ ట్రైన్ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ