హైదరాబాద్ పబ్లిక్ స్కూలులలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం !

జగిత్యాల జిల్లాకు ఆరు సీట్లు కేటాయింపు!

ప్రవేశ పరీక్ష లేదు!

జగిత్యాల గిరిజన అభివృద్ధి అధికారి !

J.SURENDER KUMAR,

2023-24 విద్యా సంవత్సరమునకు గాను అర్హత గల షెడ్యూల్డ్ తెగల బాల బాలికల నుండి హైదరాబాదులోని బేగంపేట, మరియు రామంతాపూర్ పబ్లిక్ స్కూలులలో మొదటి తరగతి ఇంగ్లీష్ మీడియం నందు ప్రవేశము కొరకు దరఖాస్తులు కోరబడుతున్నవి.జగిత్యాల  జిల్లాకు (6) సీట్లు కేటాయించినారు. అందులో ఎరుకల వారికి(1) సీటు , లంబాడ వారికి (3) సీట్లు, గోండు/నాయకపోడు వారికి(1) ఇతరులకు (1) సీటు కేటాయించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.    

అభ్యర్థి వయస్సు తేదీ:01-01-2017 నుండి తేదీ: 31-12-2017 మధ్యన జన్మించి ఉండాలి. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయము రూపాయలు అర్బన్ ఏరియాలో ₹ 2 లక్షలు  మరియు  రూరల్ ఏరియాలో ₹ 1.50 ( లక్ష యాభై వేలు)  మించరాదు.  ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము సంబంధిత తాసిల్దారు మున్సిపాలిటీ నుండి పొందవలెను. పాఠశాల నుండి తెచ్చు  ధ్రువీకరణ పత్రము తీసుకొనబడదు.  నివాసము  కుల ధ్రువీకరణ  సంబంధిత తాసిల్దారు గారిచే పొందవలెను. జిరాక్స్ కాపీలను  గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి జత చేయవలెను. దరఖాస్తు ఫారములు గిరిజన అభివృద్ధి అధికారి  కార్యాలయము కలెక్టర్ కాంప్లెక్స్  నుండి మాత్రమే పొందవలెను.  దరఖాస్తులుతేదీ:21-04-2023 నుండి 28-04-2023  వరకు పొంది తేదీ:29-04-2023 సాయంత్రము 5.00  రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో జిరాక్స్ కాపీలను దరఖాస్తు ఫారములు సమర్పించవలెను.. విద్య హక్కు చట్టం అమలు నేపథ్యంలో ఈసారి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉండదు. అయితే జిల్లాలో ఆరు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయబడును. ఇట్టి ఎంపిక తేదీ:03-05-2023 రోజున జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము కలెక్టర్ కాంప్లెక్స్ రెండవ అంతస్తు కరీంనగర్ నందు లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయబడును. జిల్లా స్థాయిలో జరుపు లాటరీ ద్వారా నిర్వహించు ఎంపికకు హాజరవుటకు ఎలాంటి రవాణా ఖర్చులు చెల్లించబడవు.  తల్లిదండ్రులే భరించవలెను తదుపరి ప్రవేశం పొందిన బాలబాలికలకు హాస్టల్ వసతి లేదు. గడువు తర్వాత వచ్చిన మరియు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తు ఫారంలో మరియు సర్టిఫికెట్లు జిరాక్స్లు కాపీలు జతచేయని దరఖాస్తు ఫారములు తిరస్కరించబడును. తదుపరి వివరాలకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము కలెక్టర్ కాంప్లెక్స్ రెండవ అంతస్తు కరీంనగర్ నందు సంప్రదించగలరు.

( కార్యాలయ ఫోన్ నెంబర్ 9652118867 నందు ఉదయము 10-30 గంటల నుండి సాయంత్రం 5-00 గంటల వరకు సంప్రదించవచ్చును)