ఇఫ్తార్ విందులు స్నేహ పూర్వకభావాన్ని పెంపోందిస్తాయి !

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎంపి మధుయాష్కి!

J. Surender Kumar,

ఇఫ్తార్ విందులు స్నేహపూర్వకభావాన్ని పెంపోందిస్తాయని మాజీ ఎంపి మధుయాష్కీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు,
జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్విందుకు వీరు హజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్
మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు ఉంటారని, అల్లా దయతో దేశ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మైనార్టీల సంక్షేమానికి 12శాతం నిధులు కేటాయించి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్విందు ఏర్పాటు చేయగా హజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.,


ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్యక్షుడు సిరాజోద్దీన్ మన్సూర్, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, ఎన్ఆర్ఎస్ఐ సెల్ నాయకులు షేక్ చాంప్పాష, నాయకులు కొత్త మోహన్, బారీ, ముకస్సర్ అలీ నేహల్, షకీల్ పట్వారీ, అజహర్, మునీరోద్దీన్ మున్నా, కమల్, నదీమ్ అర్బాబ్, అతాఉల్లా తదితరులు పాల్గొన్నారు.