ఇథనల్ పరిశ్రమకు ఏర్పాటుకు వ్యతిరేకంగా..
జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసనలు!

J.Surender Kumar,

ప్రజలకు, పర్యావరణానికి హానికరమైన ఇథనల్ పరిశ్రమ ఏర్పాటు కు వ్యతిరేకంగా. పాసిగం, స్తంభంపల్లి, తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, జిల్లా జగిత్యాలకు తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వెల్కటూర్ మండలం స్తంభంపల్లి పాసిగాం గ్రామస్తులు..కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి ప్రజావాణిలో తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని వినతి పత్రం అందజేశారు.


కోటిలింగాల ఆలయంలో డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ప్రమాణం!

ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ లక్ష్మణ్ కుమార్ , సోమవారం ప్రమాణం చేశారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేసిన ఆరోపణలు సత్యదూరమని, తాను ఎంపీటీసీ టికెట్లను జెడ్పిటిసి టికెట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ల వద్ద డబ్బులు తీసుకోలేదని కోటేశ్వర స్వామి లింగం ముందు ప్రమాణం చేశారు. ఆలోచించి బయటికి రాగానే పోలీసులు లక్ష్మణ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని సారంగాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, లక్ష్మణ్ కుమార్ పోలీసులతో వాగ్వివాదం చేస్తూ. తను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు ఏ దశలో మాకు సహకరించాల్సిందిగా పోలీసులు పదేపదే లక్ష్మణ్ కుమార్ ను కోరారు.