ఇథ్ నాల్ ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్న  ప్రజలు!
స్తంభంపల్లి , పాషిగాం గ్రామస్తులు !

J.Surender Kumar,

వెల్లటూరు మండలం లోని పాషిగాం స్తంభం పెళ్లి గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా బుధవారం ఇతనాల్  ప్రాజెక్ట్ పనులు అడ్డుకున్నారు . పనులను అడ్డుకునే ప్రయత్నం లో బరుపటి సత్తమ్మ అనే మహిల సోమ్మశిల్లి కింద పడిపోయింది.

హుటాహుటిన మహిళను ప్రజలు ఆసుపత్రికి తరలించారు.  ప్రజాభిప్రాయ సేకరణ జరిగే వరకు పనులు ఆగేలా చూస్తామని చెప్పిన పోలీసులు మాట తప్పారని వారిపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాయిల్ టెస్ట్ పేరుతో ఇత్తనాల్ ప్రాజెక్టు కోసం జరుగుతున్న పనులను రెండు గ్రామాలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ ఇక్కడ కట్టవద్దని హెచ్చరిస్తూ ఆందోళన కొనసాగించారు. ధర్మపురి సిఐ బిళ్ళకోటేశ్వర్, ఎస్సై నరేష్ ప్రజలకు నచ్చజెప్పిన వారు వినకుండా ఆందోళన కొనసాగించారు