J.Surender Kumar,
జగిత్యాల జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, బండారి నరేందర్, గుండెపోటు తో శనివారం మృతి చెందారు. టిఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీరాభిమాని నరేందర్
శనివారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండపంలో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా నిజాంబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్న నేపథ్యంలో భారీ స్వాగతం సన్నాహాలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికే నేపథ్యంలో నరేందర్ ఒగ్గు వాయిద్య కారులతో, నృత్య విన్యాసాలు చేయిస్తూ, ఎండలో వారితో పాటు కలసి నరేందర్ స్టెప్పులు వేశారు.

ఒకేసారి అక్కడికక్కడే నరేందర్ కుప్పకూలి అపస్మానిక స్థితికి చేరుకున్నారు. సహచరులు మిత్రులు ఆయన గుండెను సిపిఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చిన నరేందర్ నడుచుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నారు.

ఆసుపత్రికి చేరుకోగానే ఆయన మృతి చెందిన డాక్టర్లు నిర్ధారించారు.

ఆత్మీయ సమ్మేళనం.. సంతాప సమావేశంగా..
కళ్యాణ మండపంలో జరగాల్సిన ఆత్మీయ సమ్మేళనం బండారు నరేందర్ మృతితో సంతాప సమావేశంగా మారింది.

మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు సంజయ్ కుమార్, రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత,, మాజీ మంత్రి స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ రాజేశం గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, తదితర టిఆర్ఎస్ శ్రేణులు నరేందర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

నరేందర్ కు నివాళులర్పించిన కవిత!

మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు, నరేందర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నరేంద్ర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పరామర్శ
బండారి నరేందర్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ, జీవన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి గాజుల రాజేందర్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి లు ఎమ్మెల్సీ వెంట ఉన్నారు.

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, బీజేపీ నాయకురాలు, డాక్టర్ భోగ శ్రావణి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు నరేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.