J. Surender Kumar,
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇథనల్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా ఉన్న గ్రామస్తులతో కలిసి కలెక్టరెట్ కి వెళ్తారన్న ముందస్తు సమాచారం తో పోలీసులు శనివారం డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు.
బుగ్గరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, లక్ష్మణ్ కుమార్ పోలీసులు హౌస్ అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. లక్ష్మణ్ కుమార్ కు ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇథనల్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా పాశిగామ గ్రామస్థులు శుక్రవారం రోజున నిర్వహించిన నిరసన కార్యక్రమనికి మద్దతు తెలిపిన జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకత్వాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు నిర్బంధించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇథనల్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా ఉన్న గ్రామస్తులతో కలిసి కలెక్టరెట్ కి వెళ్తారన్న ముందస్తు సమాచారం తో పోలీసులు శనివారం రోజు ఉదయాన్నే నోటీసులు ఇచ్చారు.
ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

సుమారు ఐదు గ్రామల ప్రజలకు తెలియకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆగమేఘాల మీద మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు అని ఎటువంటి గ్రామ సభ పెట్టకుండా పోలీసుల భద్రత మధ్య పనులను మొదలు పెడితే ఆ ప్రాంత గ్రామస్థులు అందరు దానికి వ్యతిరేకంగా రోడ్ల పైకి వచ్చి పురుగుల మందు డబ్బులతో నిరసన తెలిపితే దాని కి సంఘిభావంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపితే మమ్మల్ని నిర్భందించడం న్యాయమా ? అని అన్నారు
ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దాని వేస్టేజీ అంత ఇక్కడి గోదావరి లో కలిసి మొత్తం కలుషితం అయి అక్కడి రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఆ ప్రాంతం గ్రామస్థుల అనుమతితో దాని వల్ల అక్కడి ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లదు అని నమ్మకం కలిగిస్తే మేము దాన్ని స్వాగతిస్తం, లేదు మాకు అధికారం ఉంది ,మా చేతిలో పోలీసుల బలగం ఉంది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతి పక్షాల గొంతు నొక్కలని చూస్తే ఎవ్వరికీ భయపడే ప్రసక్తి లేదు అని లక్ష్మణ్ కుమార్ అన్నారు. దీని గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తామనీ, అవసరమైతే గ్రామస్థుల తరపున కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్కడ గ్రామ సభ నిర్వహించి వారి అనుమతి తోనే ఫ్యాక్టరీ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు..