జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ అర్హతలకు కోసం అవస్థలు పడుతున్న అర్హులు..!

కలెక్టర్ కు విన్నవించిన కౌన్సిలర్ జయశ్రీ!


J.Surender Kumar,

జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూం ఎంపికలో భాగంగా లబ్ధిదారుల రేషన్ కార్డు, ఆదార్ కార్డ్, బ్యాంక్ అకౌంటు మరియు ఓటర్ కార్డు ముఖ్య ప్రమాణికంగా తీసుకుని ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంతో అర్హులు, అర్హత పొందడానికి అవస్థలు పడుతున్నారని మున్సిపల్ కౌన్సిలర్ అనుముల జయశ్రీ కలెక్టర్ విన్నవించారు.

గురువారం ఆమె కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణ పరిసర ప్రాంతాల నుండి వలస వచ్చి 10 సం॥ నుండి ఇక్కడే నివాసముంటున్నారు. కాని రేషన్ కార్డు గతంలో ఉన్న గ్రామాల పరిధిలోనే రేషన్ కార్డు పొంది తిరిగి జగిత్యాలకు మార్చుకునే అవకాశం రాకపోవడం వల్ల ప్రభుత్వం కూడ ” One Nation One Card ” అని మరియు ఆన్లైన్ అయిన కారణంగా ఎక్కడున్న బియ్యం తీసుకునే అవకాశం కల్పించడం వల్ల లబ్ధిదారులు కార్డును జగిత్యాల పట్టణంకు మార్చుకోలేక పోయారని పేర్కొన్నారు.
10 నుండి 15 సంవత్సారాల మద్య పట్టణంలో జీవనం సాగిస్తూ ఇక్కడే ఆధారకార్డు, బ్యాంక్ అకౌంటు, ఓటర్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లు ఇక్కడ అడ్రస్ ల తోనే పొంది ఉండి కేవలం రేషన్ కార్డ్ మార్చుకోకపోవడం వల్ల లబ్దిదారులు నష్టపోతున్నారు. కావున వీరందరికి ఒక్కసారి అవకాశం కల్పించి పూర్తి స్థాయి విచారణ జరిపి మంజూరు చేయాలని కోరారు.
. జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు 100% శాతం అర్హులై ఉండి కేవలం సమగ్ర కుటుంబ సర్వేలో ULB ఉద్యోగి అని వ్రాయడం వల్ల వీరు అనర్హులుగా చూపడం జరుగుతుంది. సంబంధిత మున్సిపల్ కమీషనర్ ద్వారా విచారణ జరిపి అర్హులుగా ప్రకటించాలన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేలో కూడ 4 వీలర్ అని వ్రాయటం వల్ల ఇక్కడ డ్రైవర్ గా పనిచేసే వారికి, ఎటువంటి వాహనం లేని వాళ్ళకు వాహనం ఉన్నట్లుగా చూపడం మరియు ఒకప్పుడు డ్రైవర్ గా సొంత వాహనం తీసుకున్నా ఇప్పుడు ఎటువంటి వాహనం లేకుండా అమ్ముకున్న వాళ్ళు కూడ ఉన్నారు. కావున వీరికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపి అర్హత గల అర్హులుగా గుర్తించాలన్నారు.
ఒంటరి మహిళలకు సంబంధించి అర్హులు అయిన కూడ కేవలం ఒంటరి మహిళ అని అనర్హులుగా ప్రకటిస్తున్నారు. కానీ వీరికి ఎటువంటి ఆధారం లేక పిల్లలను పోషించి పెద్దచేసి పెళ్ళిలు చెసి ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్న అందరు వచ్చిన సందర్భం లో ఇల్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా వీరికి కూడ అర్హులుగా ప్రకటించాలని కౌన్సిలర్ జయశ్రీ కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.