కౌన్సిలర్ హనుమండ్ల. జయశ్రీ !
J. SURENDER KUMAR,
శనివారం జరిగిన జగిత్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో అందించిన ఎజెండా అంశాలలో అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఈ అంశాల విచారణ జరపాలని కోరుతూ కలెక్టర్ కు 35 వార్డు కౌన్సిలర్ ఏ. జయశ్రీ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుల అంశాలు ఇలా ఉన్నాయి!
👉 క్రొత్త కౌన్సిల్ ఏర్పడ్డ సమయంలో సానిటేషన్ లేబర్ 215 మంది. కలెక్టర్ ఆమోదంతో 30 మందిని పత్రిక ప్రకటన ద్వారా అధికారుల ద్వారా 30 మందిని తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం మంది 245 నుండి రెగ్యులర్ PH వర్కర్స్ 48 మంది మొత్తం 293 మంది మాత్రమే అయితే ఇక్కడ 304 మందిగా ఏవిధంగా చూపుతున్నారు.?
👉 జగిత్యాల పట్టణాన్ని 8 జోన్లు గా విభజించారు, ఏ జోన్ లో కూడ బయోమెట్రిక్ వాడుట లేదు. ఇక్కడ 11 మంది ఎక్కువగా చూపడం జరిగింది. వీరిని ఏ విధంగా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 1,50,000కు రూ॥ తీసుకొని నియమంచడం జరిగిందని కొత్తగా చేరిన వారు చెప్పడం జరిగింది.
👉 గతంలో కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ నేను ఉద్యోగం చేయను జీతం సరిపోవటం లేదు అని అప్పుడున్న కమీషనర్ స్వరూపరాణికి, రాసి ఇస్తే ఆ ఫైల్ అప్పటి కలెక్టర్ రవి పంపించి వారి ఆదేశాల మేరకు విదుల నుండి తొలగించిన వ్యక్తిని ,మళ్ళీ ఈ రోజు ఏవిధంగా విధులలోకి తీసుకోవడం జరిగింది.
👉 మున్సిపల్ లో క్రొత్త గా నియమించాలనుకుంటే కలెక్టర్ అనుమతి తప్పని సరి కానీ, ఇక్కడ ఎక్కడ కూడ కలెక్టర్ ఆదేశాలు లేకుండానే నియమాకాలు చేపట్టడం జరుగుతుంది.
👉 సానిటేషన్ విభాగానికి సంబంధించి రిపేర్లు, మరియు లేబర్ల వివరాలు వారికి సంబంధించిన జీతాల వివరాలు కావాలని దరఖాస్తు గత 25రోజుల క్రితం ఇచ్చిన ఇప్పటికి వివరాలు ఇవ్వలేదు.
👉 సానిటేషన్ విభాగంలో ఉన్న లేబర్ 304 అని చెప్పారు. కాని ఇందులో పనిచేస్తున్నది కేవలం 293 మంది మాత్రమే ఎజెండాలో పొందు పర్చిన అంశం (6) లో ఔట్సోర్సింగ్, శాశ్వత కార్మికులకు 24 సబ్బులు, kg.నూనె మరియు (2) జతల చెప్పులు మొత్తం ఖర్చు ₹ 2,67,520/- రూ,, అయితే ₹ 3,50,000/- రూ,, ఆమోదం కొరకు పెట్టారు. ఇక్కడ ₹ 82,480 /-రూ,, అదనంగా చూపి కౌన్సిల్ ను తప్పుదోవ పట్టించారు.
👉 అంశం నెం’8′ లో (2) జతల బట్టల కొరకు (304) మంది అప్రూవల్ తీసుకున్నారు. కాని, గతంలో కుట్టిన కుట్టు కులీలు ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు టేలర్ దగ్గరనే ఉన్నాయి. అందులో ఏదో తప్పు చేశారని గత కమిషనర్ ఫైల్ పైన సంతకం చేయటం లేదు. దీని పైన విచారణ చేయాలని ఇక ముందు అలా జరుగకుండా చర్యలు తీసుకోవాలని.
👉 అంశం నెం ‘9’ పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 4 చీపుర్ల చొప్పున ’12’ మాసాలకు ’48’ చీపుర్ల చొప్పున 304 మందికి 14592 చీపుర్లు అని ₹ 5,50,000 /- అవుతుందని కౌన్సిల్ తీర్మాణం తీసుకోవడం జరిగింది.
కాని, వార్డులో కేవలం ఇద్దరు. మాత్రమే ఊడ్వటం జరుగుతుంది. ఇద్దరు × 48 వార్డు లు అంటే 96 మంది 96×48 =4608 చీపుర్లు X 38రూ,, =₹ 1,75,104/- రూ,, మాత్రమే అవుతుంది. కాని, ఇక్కడ తేడా
₹ 5,50,000-₹1,75,104 = ₹ 3,74, 896/- తేడా వస్తుంది దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని. కోరారు

👉. అంశం నెం’3′ : 62 సం॥ ఉన్న చిట్యాల గంగారాం ను ఔట్సోర్సింగ్ పద్దతిలో పారిశుధ్య విభాగంలో వాహనాలకు రిపేర్లు అని నియమించుకోవడానికి తీర్మాణ తీసుకోవడం జరిగింది కాని అంత వయసున్న వ్యక్తి కాకుండా అనుభవమున్ని 45 సం॥ ల వ్యక్తి ని పేపర్ ప్రకటన ద్వారా నియమంచుకోవాలని ఫిర్యాదుల పేర్కొన్నారు.
👉 5. వార్డులలో దోమల మందు స్ప్రే, పాగింగ్ మరియు డ్రైనేజ్ తీసిన వాటి పైన బ్లీచింగ్ పౌడర్ చల్లే విధంగా ఆదేశాలు ఇవ్వాలని.
👉 ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి కౌన్సిలర్ కు వర్కులు కౌన్సిల్ ఎన్ని అప్రూవల్ అయినాయి, ఎన్ని టెండర్ అయినవి అనే వివరాలు ఎన్ని సార్లు అడిగిన ఇవ్వటం లేదు వివరాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని.👉 హరిత హారం లో ఎటువంటి అవినీతికి తావివ్వకుండా పూర్తి లెక్కలు కౌన్సిలర్లకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని.
👉 రెవెన్యూ విభాగంలో అదికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పెండింగ్ లో ఉన్ని 200 సెల్ఫ్ అసెస్మెంట్ లు క్లియర్ చేయాలని, మోటేషన్ అయి ఆన్లైన్ కాని వారందరికి ఆన్లైన్ చేయాలని మోటేషన్లు పెండింగ్ పెట్టకుండా అధిక ఫీజులు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని
👉 టాక్స్ డబుల్ ఎంట్రీలను క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మనవి.
👉 టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడ పెండింగ్ పెట్టకుండా వేను వెంటనే పనులు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు లో ఆమె పేర్కొన్నారు.