ఐదుగురిలో ఇద్దరి పై ₹.25 లక్షలు, మరో ఇద్దరికి ₹.5 లక్షల చొప్పున రివార్డులు!
J. Surender Kumar,
ఛత్రాలో జార్ఖండ్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.ఐదుగురిలో ఇద్దరి పై ₹.25 లక్షలు, మరో ఇద్దరిపై ₹.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి.
ఏకే 47 స్వాధీనం చేసుకున్నట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదివారం తెల్లవారుజామున, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ముగ్గురు నక్సల్స్‌ను పోలీసులు మరియు DRG సంయుక్త బృందం అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నక్సల్స్‌ను సముంద్ అలియాస్ సుమన్‌సింగ్ అంచాల (42), సంజయ్ కుమార్ ఉసెండి (27), పరశ్రమ్ దంగూల్ (55) అని పోలీసులు తెలిపారు.

“నక్సల్స్ ఉనికి గురించి కచ్చితమైన సమాచారం మేరకు, జాయింట్ టీమ్ ఆపరేషన్ ప్రారంభించింది, అని అంతఘర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ఖోమన్ సిన్హా తెలిపారు..అరెస్టయిన నక్సల్స్ వాహనాలను తగలబెట్టడం, టవర్‌లకు నిప్పంటించడం, పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి వ్యక్తులపై దాడి చేయడం వంటి అనేక ఘటనల్లో నిందితులుగా ఉన్నారని ASP సిన్హా తెలిపారు.