ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై మండిపడ్డ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్!
J. Surender Kumar,
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మతిభ్రమించి దళిత బంధు పథకం పై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదని, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో
స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ డా.గొల్లపల్లి చంద్రశేకర్ గౌడ్ తో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
👉 ఆయన మాటల్లో పాయింట్స్!
👉 కాంగ్రెస్, బిజెపిలకు తెలంగాణ రాష్ట్రం లో పుట్టగతులు ఉండవు
👉 కాంగ్రెస్ బిజెపిలు రెండు అవిభక్త కవలలు
👉 దేశంలో 125 అడుగులతో డా. బి.ఆర్. అంబేడ్కర్ అతి పెద్ద విగ్రహం పెట్టిన గొప్ప వ్యక్తి కేసిఆర్
👉 దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడితే నాయకులను జైలుకు పంపిస్తాం
👉 జగిత్యాల అభివృద్ధి కనబడడం లేదా జీవన్ రెడ్డికి
👉 దళితను ఓట్లు వేసే యంత్రాలుగా చూసింది మీరు కదా జీవన్ రెడ్డి
👉 దళితులకు 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం చేశారో చెప్పాలి
👉 భారత దేశచరిత్రలో దళితబందు పథకం సువర్ణ అధ్యాయము
👉 జీవన్ రెడ్డికి దమ్ముంటే పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కొట్లాడాలి
👉 ఢిల్లీలో ,గల్లీలో లేని పార్టీ కాంగ్రెస్
👉 60 ఏండ్లలో మీరు ఎన్నిఇండ్లు ఇచ్చారో సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మల్యాల జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, పాక్స్ ఛైర్మెన్ సాగర్ రావు, మల్యాల AMC ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, జగిత్యాల, బీర్ పూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్, నల్ల మహిపాల్ రెడ్డి, బి సి సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి వంశీ బాబు, నాయకులు రాజేందర్,.అశోక్,.కొండగట్టు ఆలయ డైరెక్టర్ సురేష్, నక్కగంగాధర్, నారాయణ, మల్లేశం, కోమురయ్య, గంగిపెళ్ళి శేకర్, సునీల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.