భక్తజనంతో పోటెత్తిన ఆలయ ప్రాంగణం!
J.Surender Kumar,
మంగళ వాయిద్యాలు వేద మంత్రాల ఘోషలో అంగరంగ వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి సహస్ర కలశాభిషేకం ఆదివారం ఉదయం కన్నుల పండువగా జరిగింది.

ఈ సుందర మనోహర దృశ్యాన్ని తిరగించడానికి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది.

స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు ఉదయం, వేదపండితులు, అర్చకులు, పురుషసూక్త , శ్రీసూక్తం కల్పోక్త న్యాసపూర్వక , షౌడశోపచార పూజ , సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో, రుద్రాభిషేకం , మరియు వాస్తు , యోగిని, క్షేత్ర పాలక , నవగ్రహ, సర్వతోభద్రమండలి , స్థాపిత దేవతాపూజల అనంతరం పూర్ణాహుతి , శ్రీ యోగ, శ్రీ ఉగ్ర స్వామి వారికి సహస్ర కలషాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

కన్నుల పండువ గ జరిగిన సహస్ర కలశాభిషేకం మహోత్సవం తిలకించడానికి, భక్తజనం గంటల తరబడి బారులు తీరి వేచి ఉన్నారు.








