J.SURENDER KUMAR,
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ రైతు పక్షపాతి ప్రభుత్వంగా కొనసాగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సోమవారం ధర్మపురి మండలం జైన, ఎడపల్లి – మగ్గిడి, రాజారాం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ₹ 58 లక్షల తో కో-ఆపరేటివ్ సొసైటీ భవనం, ఎడపల్లి ₹ 72 లక్షల నిధులతో ఎరువు గోదాం, రాజారాం లో ₹ 78 లక్షల నాబార్డ్ నిధులతో గోదాం, జైన గ్రామంలో ₹ 25 లక్షల తో నిర్మించిన రైతు వేదిక, ₹10 లక్షల తో నిర్మించిన ముదిరాజ్ సంఘ భవనం, ఎస్సీ కాలనీ లో ₹10 లక్షల తో నిర్మించిన సిసి రోడ్డు,ను మంత్రి ప్రారంభించారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మౌళిక సదుపాయాల రూప కల్పనలో భాగంగా ₹ 32 లక్షల తో నిర్మించిన అదనపు తరగతి గదులు, టాయిలెట్లలను రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ కొండూరు రవింధర్ రావు తో కలసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మౌలిక సదుపాయల కల్పన లో భాగంగా తొలి దశలో భాగంగా 9 వేలకు పైగా స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమల మన బస్తి-మన బడి పేరుతో అమలు చేయనున్నారు అని మంత్రి పేర్కొన్నారు
రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తోన్న మొత్తం పాఠశాలల సంఖ్య 29,952 కాగా.. వీటిలో 26,065 పాఠశాలలు ప్రభుత్వ స్థానిక సంస్థల కింద నడుస్తున్నాయి అన్నారు.

ఈ పాఠశాలలను ఆధునీకరించేందుకు ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం.
పూర్వ విద్యార్థులను కూడా దీనిలో భాగస్వామ్యం చేసి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోంది. గ్రామాలలోని పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేపట్టాలని, అందుకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి ఈశ్వర్ అన్నారు.