ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులను బేఖాతరు !
అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసిన చర్యలు ఉండవు!
ఆడిట్ అభ్యంతరాలు ఉన్న అడిగేది ఎవరు!
అంజన్న ఆదాయము కొల్లగొడుతున్న, అడ్డుకునేది ఎవరు ?
అంజన్న నిన్ను ఆదుకునేది ఎవరన్నా ?
(J. Surender Kumar,)
మహిమాన్విత ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి శక్తి సామర్థ్యాల భక్తజనం కు ( స్వామి పవర్ పై శని గ్రహ భూతపేత పిచాచాలు దరిచేరకుండా) ఎంత నమ్మకం ఉందో, ఈ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు, అర్చకులు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణల పై చర్యలు తీసుకోకుండా, ఒకవేళ విచారణ జరిగిన విచారణ నివేదికలు తొక్కి పెట్టడంలో తమ రాజకీయ, ఆర్థిక పవర్ వినియోగిస్తూ యధావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.

ఆంజనేయ స్వామి పవర్ కు ప్రత్యక్ష నిదర్శనమే నాలుగు రోజుల ఆదాయం!
చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కేవలం నాలుగు రోజుల (4-04-2023 నుంచి 7-04-2023) ప్రత్యేక దర్శనాలు , కేశఖండనం దీక్ష, ప్రసాదాల అమ్మకం ద్వారా ఒక కోటి 45 లక్షల 65 వేల 445 రూపాయలు (1,45,65,445) ఆదాయం ఆలయానికి వచ్చినట్టు రికార్డులు స్పష్టంగా నమోదు చేసారు.
ఈ లెక్కన రోజుకు,₹ 36 లక్షల 41 వేల, 365
రూపాయల 25 పైసలు భక్తుల ద్వారా ఆదాయం
లభించింది .(ఇందులో హుండీలో వేసిన కానుకలు ఈ పరిధిలోకి రాలేదు)
అధికారుల, అర్చకుల పవర్ వివరాలు!
పాలకవర్గ చైర్మన్ ఫిర్యాదు చేసిన…
కొండగట్టు ఆలయంలో గత సంవత్సరం నవంబర్ 23న హైదరాబాద్ దేవదాయశాఖ కు చెందిన అధికారిని ఏడిసి జ్యోతి మేడమ్, కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, కొండగట్టు ఆలయంలో విచారణ జరిపారు. కొండగట్టు ఆలయ పాలకవర్గ చైర్మన్, ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు, సమయపాలన పాటించడం లేదని, నిధుల 30% పరిధి అతిక్రమించిందని, అనవసర ఖర్చులతో ఆలయానికి ఆదాయంకు గండి పడుతుందని తదితర అంశాలపై హైదరాబాదులో కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టారు. విచారణలో వాటర్ బాటిల్ కొనుగోలు, హుండీ లెక్కింపులో స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు చెల్లించినట్టు నమోదు చేయడం. నవంబర్ మాసం నాటికి బడ్జెట్ శాంక్షన్ అనుమతులు లేకుండానే నిధులు ఖర్చు చేయడం లాంటి అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విచారణలో గుర్తించినట్టు సమాచారం. విచారణ చేపట్టి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టడానికి జంకుతున్నారు.
రికవరికి జంకుతున్నారు!

ఆడిట్ అభ్యంతర డబ్బుల మొత్తం!
₹ 21 కోట్లు 80 లక్షల, 76 వేల 137/-
అధికారుల పర్యవేక్షణలో జరిగే కోట్లాది రూపాయల నిధుల, ఖర్చులకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల పద్ధులకు, సంబంధించిన లెక్కలకు, ఆమోదయోగ్యమైన, పత్రాలు లేనట్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆడిట్ అధికారులు రికార్డులలో నమోదు చేశారు.
ఇట్టి డబ్బులను బాధ్యుల నుండి రికవరి చేయడానికి ప్రభుత్వం జంకుతున్నట్టు చర్చ.
కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నిరుద్యోగ అర్చక స్వాములు !

అర్చక పోస్టుల ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చక నిరుద్యోగులు, తమకు అన్యాయం జరిగిందంటూ. బందు ప్రీతితోనే ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు తన రక్త సంబంధీకులను ఎంపిక చేశారని, ఇంటర్వ్యూలను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని. నిరుద్యోగ అర్చక స్వాములు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన విచారణ జరిపి బాధ్యులపై చర్యల కోసం అధికారులు సతమతమవుతున్నట్టు చర్చ.
విధులు నిర్వహించడానికి విముఖత!

దేవాదాయ శాఖ కమిషనర్ లేక సంఖ్య B1/4170/2021, 17/2/2023 న డిప్యూటీ కమిషనర్ హోదా గల వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొమురవెల్లి ,బాసర, సికింద్రాబాద్ గణేష్ ఆలయాల, కార్యనిర్వహణాధికారుల కు జారీ చేసిన ఉత్తర్వులలో కొండగట్టు ఆలయంలో విధులు నిర్వహించడానికి వారి హోదా స్థాయి గల వారి సర్వీస్ వివరాలను పంపించాల్సిందిగా ఉత్తరంలో పేర్కొన్నారు.
ఇక్కడి ఆలయంలో విధులు నిర్వహించడానికి ఉద్యోగులు సమ్మతి (, విల్లింగ్) ఇవ్వడానికి భయపడుతున్నట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ.
విజిలెన్స్ విచారణ నివేదికతో బదిలీ చేశారు!
తిరిగి ఇక్కడే విధుల్లో చేర్చుకున్నారు!
కొండగట్టు ఆలయంలో అవినీతి అవకతవకలపై విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో బాధ్యులైన ఉద్యోగులను గుర్తిస్తూ కమిషనర్ కు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా కొందరు ఉద్యోగులను గత కొన్ని నెలల క్రితం ఇతర ఆలయాలకు కమిషనర్ బదిలీ చేశారు.
గత నెల రోజుల క్రితం అవినీతి ఆరోపణలపై బదిలీ కాబడిన అధికారిని తిరిగి కొండగట్టు ఆలయంకు. కమిషనర్ బదిలీ చేసారు.
ఉద్యోగులు పాటించని నియమనిబంధనలు!

ఫైల్ ఫోటో
ఆలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులు తిలకం పెట్టుకొని సనాతన సాంప్రదాయాలను ఆచరిస్తూ విధులు నిర్వహించాలని నిబంధనలు. ఇక్కడ కొందరు ఉద్యోగులు తమ ఇష్టానుసారంగా దుస్తులు ధరిస్తూ సాంప్రదాయ ఆచారాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు ప్రత్యక్షం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఉద్యోగులు ధరించిన దుస్తులే ప్రత్యక్ష నిదర్శనంగా భక్తుల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
నిధులు దుర్వినియోగంపై నిలదీసిన భక్తులు!

కొండగట్టు అంజన్న నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో సంబంధించిన అధికారులను భక్తులను నిలదీసిన సంఘటన లు. అనేకం తర్వాత మాట్లాడుతాను నిలదీసిన భక్తులను. అధికారులు ప్రాధేయపడుతున్న సందర్భాలు. ఎన్నెన్నో అనే చర్చ కొనసాగుతుంది.
నెలకింత…ఎవరికి ఎంత ,?
కొండగట్టు ఆలయంలో కొందరు ఉద్యోగులు ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తూ ఓ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకున్నారనే చర్చ ఉంది. అవసరం మేరకు ఎవరికైనా సమస్యలు కలిగితే.ఇంతో అంతో ముట్ట చెప్పి పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫిబ్రవరి మాసంలో కొండగట్టు ఆలయంలో భారీ దొంగతనం జరిగిన, చోరీ సొమ్ము ఎంత అనే విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్న, ఈవో ఉద్యోగుల, అర్చకులపై నేటికీ చర్యలు శూన్యం.
ఆలయం లో వ్యాపార నిర్వహణకు జరిగిన టెండర్లు బహిరంగంగా అవకతవకలు జరిగిన చర్యలు శూన్యం.
స్వీపర్ పట్ల కనికరం లేని కర్కశ అధికారులు!
ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఎల్లమ్మ అనే మహిళ గత సంవత్సరం అక్టోబర్ 31న పదవి విరమణ చేసినట్టు సమాచారం. ఆమె పెన్షన్ గురించి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయింది. రేపు మాపు అంటూ ఖర్చుల అంటూ వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరి 25 నాటికి స్వీపర్ ఎల్లమ్మకు, పెన్షన్స్ ఆమెకు అందనట్టు సమాచారం.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న స్వామి పవర్ ఎంతో, అధికారుల అర్చకులు పవర్ అంతే కదా అనే చర్చ భక్తజనంలో నెలకొంది.