ప్రధాని నరేంద్ర మోడీ!
J. Surender Kumar,
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ కుటుంబ పాలన నుంచి ప్రజలకు ముక్తి కలిగిస్తాను అంటూ స్పష్టం చేశారు.
దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా ? అవినీతిపరులపై పోరాటం చేయాలా వద్దా ? అవినీతిపరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా ? వద్దా ? అంటూ సభలో పాల్గొన్న వారిని ఉద్దేశించి వారిని ప్రధాని ప్రశ్నించారు.
అవినీతిపరుల కు కోర్టుల్లో నూ చుక్కెదు అవుతుంది కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తాం, తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం అన్నారు.

కేంద్రం చేపట్టిన పథకాలన్నీ ఆలస్యం అవ్వడానికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వాల తరఫునుంచి అనుమతి లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు చాలా పథకాలను కోల్పోతున్నారు, నేను రాష్ట్ర ప్రభుత్వానికి వినతి చేస్తున్న ప్రతి పథకాలు అనుమతి అయ్యేలా సానుకూలంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న సభాముఖంగా ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.