లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు! 40 మందికి శస్త్ర చికిత్సలకు గుర్తింపు!

J. Surender Kumar,

ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో రేకుర్తి హాస్పిటల్ కరీంనగర్ సహకారంతో వందమందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
మోతే బిందు, కంటి పొరలు ఉన్నవారిని వచ్చిన డాక్టర్ల చేత 40 మందిని ఆపరేషన్ చేయడానికి గుర్తించారు. నిర్ధారించిన 40 మందిని ఉచితంగా వాహనంలో కరీంనగర్లోని రేకుర్తి హాస్పిటల్ కు తరలించారు.

వీరికి ఉచిత ఆపరేషన్ మరియు 40 మందికి శుక్రవారం ఆపరేషన్ లు నిర్వహించి
శనివారం రోజున తిరిగి స్వస్థలాలకు నిర్వాహకులు చేర్పిస్తారు
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ
సెక్రటరీ పైడి మారుతి , కోశాధికారి సిరుప రాజయ్య , మరియు సాయిని సత్తన్న , ఇందారపు రామ్ కిషన్ , జక్కు దేవేందర్ , జక్కు రవీందర్ , డాక్టర్ రవి , రంగా హరినాథ్ , పప్పుల శ్రీనివాస్ , కట్ట శ్రీహరి , ఓజ్జల మోహన్ , వినోద్ రావు , వెంకటేశ్వరరావు , మనోహర్ రావు ,పెద్ది శివ, కాసర్ల వెంకటరమణ పాల్గొన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు.