మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి!

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హాజరుకానున్నారు!


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో పాటు ఖర్గే దీక్ష లో పాల్గొంటారు.


జగిత్యాల డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్
!


J. Surender Kumar,

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షలు విజయవంతం చేయాల్సిందిగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధాని మోడీ విధానాలకు నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారని ఆయన వివరించారు. గురువారం ధర్మపురి లో ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

సభలో మోడీ అవినీతి పాలనను ఎండగడుతూ ప్రజాధనాన్ని అదాని అంబానీలకు దోచిపెడుతుంటే దాన్ని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారి పైన కుట్రపూరితంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం కోసం రాహుల్ గాంధీ గారి సభ్యత్వ రద్దుకు నిరసనగ ఈ నెల 14వ తేదీన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఒకరోజు సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటారని వివరించారు.
మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ రావు ఆధ్వర్యంలో సుమారు లక్ష మంది తో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష సభను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
ధర్మపురి అసెంబ్లీ పరిధిలో 15 న బట్టి విక్రమార్క పాదయాత్ర!
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ నెల 15 తేదీ నుండి ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లోని కొన్ని గ్రామాల నుండి కొనసాగుతుందని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులను కోరారు.
ఈ సమావేశంలో పిసిసి సభ్యుడు సంఘనబట్ల దినేష్, జైన ఎంపిటిసి బ్లాక్ కాంగ్రెస్ 1 అధ్యక్షులు కుంట సుధాకర్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందేనీ మొగిలి, ధర్మపురి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, యువజన కాంగ్రెస్ పార్టీ ధర్మపురి టౌన్ అధ్యక్షులు అప్పం తిరుపతి, NSUI టౌన్ అద్యక్షులు శ్రవణ్, స్తంభం కాడి గణేష్, రఫీయోద్దీన్, సీపతి సత్యనారాయణ, ఆశెట్టి శ్రీనివాస్, చిలుముల లక్ష్మణ్, చిట్టనోజు రమేష్ ,దూడ లక్ష్మణ్, శ్రీకాంత్,కమలాకర్ తదితరులు పాల్గొన్నారు


ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పోచయ్య!
ధర్మపురి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బొల్లారపు లక్ష్మణ్ కుమార్ నియమించారు.